ఘనంగా అజాది కా అమృత్ మహోత్సవ్..
Ens Balu
1
Vijayawada
2021-03-11 19:31:06
భారదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 స్వాత్రంత్య్ర దినోత్సవం నాటికి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో ఎంపిక చేసిన 75 ప్రముఖ నగరాలు, ప్రదేశాల్లో చరిత్రాత్మక నగరంగా విజయవాడ ను ఎంపిక చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 75 వారాలుపాటు " అజాది కా అమృత్ మహోత్సవ్ " పేరిట ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని విజయవాడ వేదికగా ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి ని నింపేలా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. మార్చి 12 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు పిడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి బాపూ మ్యూజియం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రభుత్వ ఘంటశాల సంగీత కళాశాల ప్రాంగణంలో ఫోటో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు , స్వాతంత్ర్య సమరయోధులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర యువజన వ్యవహారాల విభాగం , ఎన్ ఎస్ ఎస్, ఎన్ ఎస్ ఓ, ఎన్ సి సి వాలంటీర్స్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని చారితాత్మక, ప్రాముఖ్యత గల నగరాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 5 వరకు 25 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దండి సత్యాగ్రహం మార్చి 12 ప్రారంభం అయి ఏప్రిల్ 5 న ముగిసింది. వాటిని గుర్తు చేసునేలా ర్యాలీలు, సైకిల్ ర్యాలీ లు, వివిధ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు భారత దేశ స్వాతంత్ర్య కోసం స్వాతంత్ర్య సమరయోధులు పడిన ఇబ్బందులు పై సమావేశాలు, చర్చలు, సెమినార్ లు నిర్వహించడం జరుగుతుందని ఇంతియాజ్ తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలను పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అదేవిధంగా కళాశాల, యూనివర్సిటీ ల స్థాయి లో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల , జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ , నేతాజీ, తదితరులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.