డా.వైఎస్సార్ ఆశయాల ప్రతిబింబమే ఈ వైఎస్సార్సీపీ..


Ens Balu
2
Tadepalle
2021-03-12 08:28:11

ఒక మహోన్న వ్యక్తి ఆశయం..ఒక మహానువుడి ముందు చూపు..ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత స్థానం..అశేష జనవాహిని విశేషంగా గుర్తుపెట్టుకున్న వ్యక్తి..ఆయనే దివంగత ప్రియతమనేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డి. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అతీతంగా డాక్టర్ వైఎస్సార్ ఆలోచనలు ప్రజలకు చేరువ కావాలని నాడు యువనేత సంకల్పించింది ప్రాణం పోసిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) ఆ పార్టీ ఆవిర్భవా(12 మార్చి 2011 నికి నేటితో పది వసంతాలు(12 మార్చి 2021) నిండాయి. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ప్రజల కోసమే కష్టపడిన పార్టీగా, అత్యతం ప్రాధాన్య కలిగిన పార్టీగా, ఒక వ్యక్తికోసం ప్రజల నాడితెలుసుకున్న పార్టీగా ఆవిర్భవించడం ఒక చారిత్రక ఘట్టం. నాడు డావెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన గుర్తుగా కాంగ్రెస్ అనే పేరు కలిపినా వాస్తవానికి కాంగ్రెస్ అంటే ఒక సమావేశం అని అర్ధం. అందరికోసం సమావేశమై ఏర్పాటైన పార్టీగా వైఎస్సార్సీపీ ఆవిర్భవించి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ ఆశీస్సులు, యువ నేత క్రుషి కష్టంతో నేడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతుంది. అంతేకాదు పార్టీ ఏ ప్రాధమిక సూత్రాలతో అయితే ఏర్పాటైందో వాటినే సంక్షేమ పథకాలుగా అమలు చేసి నవరత్నాలుగా ప్రజలకు అందజేసిన యువ ముఖ్యమంత్రిగా కూడా వైఎస్.జగన్మోహనరెడ్డి చరిత్ర కెక్కారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసేలా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి గ్రామసచివాలయమనే వ్యవస్థతో బాటలు వేశారు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఒక లక్షా 26 వేలు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అక్షరాల 4లక్షల మంది గ్రామవాలంటీర్లను నియమించి గ్రామంలోనే ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ వస్తుంది. ఇదొక్కటే కాదు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా అంటే పార్టీ పేరులో వున్న రైతులకు అగ్ర తాంబూలం ఇస్తూ గ్రామాల్లోనే రైతులకు విశేషంగా సేవలు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వతహాగా దివంగత నేత వైఎస్సార్ ఒక వైద్యుడు. ఏ రోజైతే గ్రామాల్లో ప్రాధమిక వైద్యం ప్రజలకు అందుతుందో ఆరోజే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  గ్రామాల్లో ప్రాధమిక వైద్యం అందించి సుమారు 90 రకాల మందులను అందుబాటులోకి తీసుకు రావడం కోసం ఏర్పాటు చేసే మరొక వ్యవస్థ డా.వైఎస్సార్ విలేజి క్లినిక్ లు.  వీటి ద్వారా ప్రజలకు వైద్య సేవలతోపాటు, బాలింతలకు చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు, ప్రాధమిక రక్త పరీక్షలు కూడా ఇక్కడే చేయనున్నారు. రైతుల పాల, పాడి వ్యవస్తను అభివ్రుద్ధి చేయడానికి డైరీలను పెంచడానికి అమూల్ సంస్థంతో ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేసుకొని గ్రామాల్లోనే పాలను సేకరించి రైతులను ఆర్ధికంగా అభివ్రుద్ధి చేస్తున్నారు. గ్రామాల్లోనే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇలా అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు అందనున్నాయి. అదేవిధంగా యువతను అన్ని రంగాల్లో ముందుకి తీసుకెళ్లడం కోసం వైఎస్సార్ నాలడ్జ్ సెంటర్లు, స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేపడుతున్నారు. శ్రామికులను గుర్తించడానికి, ప్రత్యేక సెజ్ లలో ప్రైవేటు కంపెనీల ఏర్పాటు తద్వారా శ్రామికులందరికీ ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పన కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అంటే ఒక పార్టీ ఆవిర్భావం ప్రజల మనసులో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తికోసం అయినా..ఆయన ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు కావడంతోపాటు ఆయన ఆశయాలను అన్నీ అమలు చేసే పార్టీగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చేపట్టే ప్రతీ కార్యక్రమం నేడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని చేరువ అయ్యింది. పదేళ్లపాటు ప్రజలకోసమే పనిచేసి, నేడు ప్రజలను పాలిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ, ప్రభుత్వం రానున్న రోజుల్లో దివంగత మహానేత డా.వైఎస్సార్ ఆశయాలు, ఆలోచనలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనమూ కోరుకుందాం.!