వైఎస్సార్సీపీ లో రెబల్ రాజకీయాలు తొక్కిపడేస్తారా..


Ens Balu
3
Tadepalle
2021-03-15 09:11:55

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా  11 కార్పొరేషన్లలో (621 వార్డులు), 75 మున్సిపాలిటీల్లో భారీ విజయం సాధించిన  అధికార పార్టీ వైఎస్సార్సీపీ సొంతింటిలోనే రెబల్ బెడద వెంటాడుతోంది.. ఆవిషయం నగిరి ఎమ్మెల్యే ఆర్కెరోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న వైఎస్సార్సీపీ రెబల్ కేడర్ లో భారీ చర్చకు దారితీసింది. పార్టీని ఓడించడానికి సొంతగూటికి చెందిన  రెబల్స్ తెరవెనుక రాజకీయాలు చేయడం  సరైన పద్దతి కాదని, అలాంటి వారిని తొక్కిపడేస్తామని మీడియా ముఖంగా బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన రోజా వ్యాఖ్యలు ఇపుడు పార్టీలోనూ, వ్యతిరేక వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే రెబల్ అభ్యర్ధుల గొడవ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కనిపించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు పార్టీ పేరుతో బరిలోకి దింపిన అభ్యర్ధులు కాకాకుండా రెబల్ అభ్యర్ధులు కాస్త అధికంగా నెగ్గి ఆపై పార్టీ కండువాలు కప్పుకున్నారు. దీనితో పార్టీ పేరుతో బరిలోకి దిగి ఓడిపోయిన అభ్యర్ధులంతా ఇపుడు పీకల దాకా బాధను మింగుతూనే, బయటకు మాత్రం మామూలుగా కొనసాగుతూనే తెర వెనుక రాజకీయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా రెబల్ కేండిడేట్ లపై వార్నింగ్ లు ఇవ్వలేదు. కానీ ఫైర్ బ్రాండ్ రోజా నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన నేతలు, సమన్వయ కర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రెబల్ అభ్యర్ధులను ప్రోత్సహించకుండా పార్టీలో ఉన్న పలుకుబడి మొత్తం గాలి తీసేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతుంది. పార్టీ కోసం నిశ్వార్ధంగా పనిచేసిన వారికే పట్టం కట్టాలని కూడా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జి మంత్రులకు సూచించారనే విషయం రోజా వార్నింగ్ తరువాత బట్టబయలు అయ్యింది. అయితే పార్టీ గెలుపొందిన సీట్ల సంఖ్యను భారీగా చూపాలనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో ఇప్పటి వరకూ ఎవరూ రెబల్ కేండిడేట్ లకోసం మాట్లాడలేదు..వార్నింగులు కూడా ఇవ్వలేదు.. కానీ రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రతీ ఒక్కరినీ ఆలోచింప జేస్తున్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానమే రెబల్ కేండిడేట్ ల గాలి పక్కన పెట్టడానికి ఈ విధమైన వార్నింగ్ ను ఫైర్ బ్రాండ్ రోజాతో ఇప్పించి తద్వారా రెబల్ రాజకీయాలకు తెరదించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే ఇప్పటి వరకూ రెబల్ రాజకీయాలు చేసి, పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపునకు అడ్డు పడిన వారిని దూరం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికితోడు...నిన్నటి మున్సిపల్ ఫలితాలు రోజునే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన తొక్కిపడేస్తాం అనే డైలాగ్ ఇపుడు రాష్ట్రంలోని రెబల్ కేండిడేట్స్ లో భయం గంట మోగిస్తుంది. తమకు ఏ స్థాయిలో అన్యాయం జరిగిందో బయటకు చెప్పుకోలేక మదన పడుతూ ఇప్పటివరకూ ఎన్నికల బరిలో ఓడిపోయి ఉన్నవారికి ఆర్కేరోజా వ్యాఖ్యలు కాస్త ఊరట నిచ్చాయి. చాలా మంది ఈ వార్నింగ్ ను లైట్ తీసుకున్నా.. ఈ వార్నింగ్ వెనుక పార్టీలో చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వార్నింగ్ ఫలితాలు, రెబల్ కేండిడేట్ లను, నాయకులను అధికారపార్టీ  ప్రభుత్వం వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు ఏవిధంగా పరిగణిగనిస్తారో వేచి చూడాలి. అదే సమయంలో ఎంతో ఖర్చుపెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన నిజమైన పార్టీ అభ్యర్ధులను ఏరకంగా ఆదుకుంటుందో కూడా వేచి చూడాలి..!