ఆ ఘనత ఎప్పటికీ డా.వైఎస్సార్ దే..కెసిఆర్


Ens Balu
4
హైదరాబాద్
2021-03-17 15:36:26

నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని  తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు పునరుద్ఘాటించారు. అలాంటి మంచి పనినిన మేమే అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని తమకు లేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్‌నిర్మిస్తామన్న కెసిఆర్ 9.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సభకు వివరించారు.  ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్‌ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో మా పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని వివరించారు. పెట్రోల్‌ ధరలను అదుపు చేయడం మా చేతుల్లో లేదన్న కేసీఆర్ ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్నివసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.