చిత్తూరు ఉప ఎన్నికల్లో నోటా హవా..
Ens Balu
3
తిరుపతి
2021-05-02 07:01:22
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో నోటా తన హవాని చాటుకుంది. అత్యధిక సంఖ్యలో తిరుపతిలో ఓటర్లు నోటాకి ఓట్లు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి గెలుపు, ఇతర ప్రత్యర్ధి పార్టీలకు ఓటమి వస్తుంటాయి. కానీ విచిత్రంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఆదివారం లెక్కింపు జరుగుతున్న మధ్యాహ్నాం 12.05 గంటల సమయానికే ఒక్క నోటాకి 4950(1.4 శాతం) ఓట్లు పోలవడం అన్ని రాజకీయ పార్టీల వారిని ఆలోచనకు గురిచేసింది. అంటే చాలా మంది ప్రజలకు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలబడిన వారెవరికీ ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా అధికారికంగా చెప్పినట్టు అయ్యింది. వైసీపీ: 2,04,370(56.1 శాతం), టీడీపీ: 1,17,612(32.3 శాతం) , బీజేపీ: 20,811(5.7 శాతం), కాంగ్రెస్ : 3,280(0.9 శాతం) ,సీపీఎం :1,892(0.5 శాతం), ఇతరులు : 11,337(3.2 శాతం) ఓట్లు సాధించారు. ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది..