గ్రామ సచివాలయంలో మరో ముసలం..
Ens Balu
20
తాడేపల్లి
2021-05-03 13:50:03
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఏడాది తిరగగానే మరో కొత్త ముసలం మొదలైంది. గ్రామ పంచాయతీ, గ్రామసచివాలయాలు స్థానిక సంస్థల ఎన్నికల తరువాత వేరుగా మారిపోయాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం జీఓనెంబరు-2 ద్వారా గ్రామసచివాలయానికి వీఆర్వోను డిడిఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనితో ప్రభుత్వం ప్రతీ 3వేల మందికి ఒక గ్రామసచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ నియమించిన గ్రామ కార్యదర్శి గ్రేడ్-5 లకు పనిలేకుండా పోయింది. ఆర్ధికపరమైన అంశాలతోపాటు, కొన్ని అధికారాలను డీడీఓలుగా ఉన్న వీఆర్వోలకే అప్పగించడంతో సచివాలయ కార్యదర్శిలు పలు క్లస్టర్లలో చేసేపనులకు ఎవరు జవాబుదారీగా ఉండాలో తెలియక మధన పడుతూ, రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన మొదలు పెట్టారు. పంచాయతీలకు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలను నియమించి, గ్రామసచివాలయాలకు గ్రేడ్-5 కార్యదర్శిలను అధిపతులను చేయడంతోపాటు ఆర్ధికపరమైన అంశాలు తమకే అప్పగించాలనేది వీరి వాదన. సచివాలయ కార్యదర్శిలు సెల్ఫ్ డిడిఓలుగా ఉన్నప్పటికీ ఆర్ధిక పరమైన అంశాలతోపాటు ఇతరత్రా అంశాలన్నింటికీ ప్రభుత్వం వీఆర్వోలనే సచివాలయాలకు బాసులను చేయడంతో వీరంతా తమ విధులు, బాధ్యతలు, క్లష్టర్ పరిధిలోని పనులకు ఎవరు జవాబు దారో చెప్పాలంటూ ఎంపీడీఓలకు, జిల్లా పంచాయతీ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సిబ్బందిని వివిధ విభాగాల్లో నియమించిన ప్రభుత్వం సచివాలయాలకు గ్రేడ్-5 కార్యదర్శిలగా ఉంచిన ప్రభుత్వం షడన్ గా వీఆర్వోలను డిడిఓలుగా చేయడం పట్ల గ్రామ కార్యదర్శిలంతా ఆందోళన బాట పట్టారు. వీఆర్వోలు విద్యార్హతలు ఇంటర్మీడియట్ మాత్రమేనని, తాము డిగ్రీలు చదువుకొని ఎపీపీఎస్సీ ద్వారా విధుల్లోకి చేరామని వాధిస్తున్నారు. అదీ నిజమే వీఆర్వోల్లో చాలా మంది పదవ తరగతి చదివిన వారే ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఇంటర్ విద్యార్హత చేయడంతో వీరంతా ఇంటర్ పాసయ్యారు. అతి కొద్దిమంది మాత్రమే దూరవిద్యలో డిగ్రీ చదివారు. కానీ గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు మాత్రం నేరుగా డిగ్రీ క్వాలిఫికేషన్ లో విధుల్లో చేరి సుమారు ఏడాదిన్నరగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నారు. దీనితో ఒక్కసారిగా వీరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓ పట్ల అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం వీఆర్వోలకు అధికారాలిస్తూ జారీచేసిన జీఓనెంబరు2 లోపాలను, అర్ధం కాని కొన్ని అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ చాలా పంచాయతీలు ఇన్చార్చి కార్యదర్శిలతోనే నడుతుస్తున్నాయి. మరికొన్ని గ్రామసచివాలయాల్లో విధులు, రికార్డులు, సిబ్బంది బదాలయింపులు కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలోనే పంచాయతీ ఎన్నికలు జరగడం, అక్కడ పంచాయతీ కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పనులు ఉండటంతో జీఓ నెంబరు 2 ద్వారా గ్రామసచివాలయంలోని గ్రేడ్-5 కార్యదర్శిల అధికారాలన్నీ వీఆర్వోల చేతి వెళ్లిపోవడంతో అంతా గందరగోళంగా మారింది. ఈ జీఓనెంబరు విషయంలో తొలుత ప్రభుత్వం కాస్త క్లారిటీ ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో గ్రామసచివాలయంలో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు తమ అధికారాలు పోతే, ఆర్దిక పరమైన విషయాలకు తమకంటే స్థాయి తక్కువగా వున్న వీఆర్వోల దగ్గరకు ఎలా వెళతామనే భావనలో ఉన్నారు. తాము చేసే పనులకు ఆర్ధిక అధికారాలు తమకు అప్పగించాలని, పంచాయతీలకు ప్రత్యేకంగా కార్యదర్శిలను నియమించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా వుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నవారందరికీ ప్రొభిషన్ పిరియడ్ రెండేళ్లు ఇంకా పూర్తి కాలేదు. ఈ సమయంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేయమంటే ఆవిధంగా పనిచేయాలి. వీరు డిమాండ్ లు చేయడానికి వీలుపడదు. అయినప్పటీ ప్రభుత్వం ఇచ్చిన జీఓ విషయంలో లోపాలను, అర్ధం కానీ, మతలబులున్న విషయాలను గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రభుత్వం ద్రుష్టికి అధికారుల ద్వారా తీసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ పాత పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీల చేతిలోనే ఉన్న పంచాయతీలు, సచివాలయాల అధికారాల బదలాయింపు జరగకుండా ఇపుడు మళ్లీ ప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిల విధుల్లో కోత విధించడం తెరపైకి వీఆర్వోలను డిడిఓలుగా తీసుకురావడం ముందు ముందు ఏం జరగబోతుందనే ఉత్కంఠను రేపుతోంది..!