ఈ-ఫైలింగ్ కి దూరంగా సచివాలయాలు..


Ens Balu
6
తాడేపల్లి
2021-05-05 06:48:12

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ-ఫైలింగ్(ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సిస్టమ్) లేమి తీవ్రంగా వెంటాడుతోంది. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సుమారు ఏడాదిన్నర కావొస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ-ఫైలింగ్ విధానం మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టడం లేదు. దీనితో అవినీతి అధికారులకు మండల, జిల్లాలో స్థాయిలో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రత్యక్షంగా ఇపుడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణ సెలవు నుంచి ప్రసూతి సెలవులు, వాటియొక్క సాలరీ బిల్లుల శాఖా పరమైన అనుమతుల కోసం జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.15వేల రూపాయల జీతంతో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు సెలవులు, వాటి మంజూరు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇక సాధారణ ప్రజల అనుమతులైతే చెప్పాల్సిన పనేలేదు. వారికి సంబంధిత ద్రువీకరణ పత్రాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా శాఖల అనుమతులకు దరఖాస్తులు చేసుకునే వారంతా మండల కార్యాలయాల(ప్రభుత్వ శాఖలు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈఫైలింగ్ విధానం అమలు చేస్తే..గ్రామసచివాలయం నుంచి అప్ లోడ్ అయిన దరఖాస్తు మధ్యలో మండల శాఖ కార్యాలయం అనుమతి పొంది, ఆపై సంబంధిత జాల్లా శాఖ అధికారి అనుమతికి వెళుతుంది. అక్కడ కూడా అధికారుల క్రిందిస్థాయిలో జతచేసిన అనుబంధపత్రాల ఆధారంగా అనుమతులు నిర్ణీత సమయంలోనే అనుమతులు మంజూరు చేయడానికి ఆస్కారం వుంటుంది. అలాకాకుండా పాత కాగితపు దరఖాస్తు విధానమే నేటికీ అమలు జరుగుతుంటంతో దరఖాస్తు దారులు, ఉద్యోగుల దరఖాస్తులు ఎక్కడ పడేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అదే ఈఫైలింగ్ విధానంలో అయితే ఏ కార్యాలయంలో దరఖాస్తుదారుడు తొలుత అనుబంధ పత్రాలతో ఒక అనుమతికోసం దరఖాస్తుచేస్తాడో అవి మండల కార్యాలయం, జిల్లా కార్యాలయ అధికారుల అనుమతితో ఆన్ లైన్ లోనే తేదిలు, సమయాలతో సహా భద్రంగా ఉంటాయి. ప్రభుత్వం శాఖల అధికారులు కూడా నిర్ణీత సమయంలోనే అనుమతులు మంజూరు చేయడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే  గ్రామ సచివాలయం నుంచి దాఖలైన దరఖాస్తు మండల కేంద్రంలో ఆగిపోయినా, లేదంటే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి చేరకపోయినా అనుమతులు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మళ్లీ దరఖాస్తు దారులు గ్రామ సచివాలయాలకు వచ్చి ఇక్కడ దాఖలు చేసిన దరఖాస్తు నకలను, మండల కార్యాలయంలో దాఖలు చేసిన దరఖాస్తు నకలను, తీసుకొని జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. అక్కడ కూడా అధికారులు, సిబ్బందికి  ఖాళీ ఉంటే తప్పా అనుమలుతు వచ్చే పరిస్థితి ఉండదు.  అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులైతే ప్రత్యేక సెలవులు, ప్రసూతి సెలువుల అనుమతుల కోసం మరోసారి జిల్లా కార్యాలయాలకు వెళ్లడానికి సెలవులు పెట్టాల్సి వస్తుంది. ఆ ఫైళ్లకు మోక్షం కలగడానికి వీరికొచ్చే అతి తక్కువ జీతం నుంచి అధికారులకు, సిబ్బందికి మామూళ్లు సమర్పించాల్సి వస్తుంది. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ గిరిజా శంఖర్ చొరవ తీసుకుంటే తప్పా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఈఫైలింగ్ విధానం అందుబాటులోకి రాదు. ప్రజలకు సత్వరమే సేవలు కూడా అందే పరిస్థితి లేదు. ఈ శాఖలో పనిచేసే సుమారు లక్ష మంది ఉద్యోగులకు, అందులో పనిచేసే మహిళల ప్రసూతి సెలవులు, ప్రత్యేక సెలవులకు సంబంధించిన అనుమతులు కూడా సకాలంలో అందే పరిస్థితి కనిపంచడం లేదు. ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసు కుంటుందో వేచి చూడాలి..!