ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు హర్షనీయం..


Ens Balu
1
విశాఖపట్నం
2021-05-06 04:44:19

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్ గుర్తిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల అల్లూరి చరిత్ర పరిశోధకులు, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ మ్రుత్యువాత పడిన జర్నలిస్టులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాస్త భరోసా దక్కుతుందన్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా  ప్రకటించండం కూడా అభినందనీయమన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ఈఎన్ఎస్ బాలు డిమాండ్ చేశారు. కరోనా అప్డేట్స్ ను ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ అందించేది ఒక్క మీడియానేనని అన్నారు. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు వందకు పైగా జర్నలిస్టులు మ్రుత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాంరు. ప్రభుత్వాలు బాధిత జర్నలిస్టుల కుటుంబాల సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాలను సత్వరమే అందించి మ్రుత్యువాత భారిన పడిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.