రవి అస్థమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడ గడలాడించన యోధుడు..విశాఖ మన్యంలో మహోదయాన్ని స్రుష్టించిన ధీరుడు.. విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు భరతమాత దాస్యశ్రుంఖలాలను తెంచడానికి అతి పిన్న వయస్సులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణత్యాగం త్యాగం చేసిన మహానుభావుడు. ఆయన భరతజాతికోసం చేసిన ఉద్యమం ప్రపంచం మొత్తం నేటికీ గర్విస్తుంది. కానీ ఆ మహోన్న వ్యక్తి పుట్టిన దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నేటికీ పాలకులు ఆయనకు ఒక సముచిత స్థానాన్ని కల్పించలేదు. 07-05-1897 ఆయన ఈ పుణ్యభూమిపై తుది శ్వాస వదిలిన రోజు. నేటికి 97 సంవత్సరాలు పూర్తవుతుంది. స్వాతంత్ర్య భారత దేశంలో నేటికీ అల్లూరిని పూర్తిస్థాయిలో పట్టించుకున్న ప్రభుత్వాలు లేవంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఉండదు..ప్రతీ భారతీయుడూ తలదించుకునే సందర్భం..సిగ్గు పడుతూనే ఆయన వీరోచిత పోరాటాన్ని మననం చేసుకుంటూ ఈ పధాలను వల్లెవేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య పోరాటానికి గుర్తుగా నేటికీ పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన పేరుతో కనీసం ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేయలేదు. ఏ రాజకీయపార్టీ అయినా తమ ఎన్నికల ప్రచారంలో అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామనే ప్రచారంతోనే గద్దెనెక్కుతున్నాయి ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెడుతున్నాయి. నేటికీ అల్లూరి సీతారామరాజు చరిత్రపైనా, బ్రిటీషు కాలం నాటి గెజిట్ల పైనా నేటికీ తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేయలేదంటే అల్లూరి సీతరామరాజుకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ స్థాయిలో గౌరవాన్ని, స్థానాన్ని ఇస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయనాయకులకు ఊరూరా విగ్రహాలు, పాదయాత్రలకు పైలాన్లు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకొని రాజకీయం చేసే రాజకీయపార్టీలు అల్లూరి సీతారామరాజు వర్ధంతి, జయంతిలను అధికారికంగా ఏర్పాటు చేసి(వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం గత ఏడాది అధికారికంగా చేశారు) ఆయన చరిత్రను పాఠ్యాంశంగా అందించే యోచన చేయడం లేదు. బ్రిటీషు సేనలపై అల్లూరి చేసిన పోరాటం అత్యధికంగా విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట వేదికగానే సాగింది. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా, విశాఖ ఏజెన్సీలోని మన్య ప్రాంతంలోనూ సాగింది. కనీసం ఈ ప్రాంతాల్లోనైనా అల్లూరి విగ్రహాలను ఏర్పాటు చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏజెన్సీలక్ష్మీపురం గ్రామంలో మాత్రం అల్లూరి స్మారక మందిరాన్ని అభివ్రుద్ధి చేసి చేతులు దులుపుకున్నారు. అల్లూరి పుట్టిన ప్రదేశంలోగానీ, పోరాటం చేసిన ప్రాంతాల్లో గానీ ఆయన పేరుతో కనీసం గ్రంథాలయాలను సైతం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో వున్న వైఎస్సార్సీపీ సర్కారు కూడా అల్లూరిపేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి అపుడే రెండేళ్లుపూర్తవుతుంది. నేటికీ అతీ గతీ లేదు. అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి సమాంతర వ్యవస్థను క్రిష్ణదేవిపేటలో రచ్చబండ పంచాయతీల పేరుతో ఏర్పాటు చేసి మన్యం పితూరి ఉద్యమం ద్వారా తెల్లవాడిపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆయన పోరాటానికి గుర్తుగా క్రిష్ణదేవిపేట ప్రాంతాన్ని లేదా..దీనికి అనుబంధంగా వున్న ప్రస్తుతం రెవిన్యూ డివిజన్ కేంద్రంగా వున్న నర్సీపట్నం ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లగా ఉన్న డిమాండ్ కి అతీగతీ లేదు. ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చి అందులో ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చెప్పినా అదీనేటికీ జరగలేదు. భారతీయుల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరునికి ఏ ప్రభుత్వమూ సముచిత స్థానం కల్పించలేదనే విషయం 97 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నా పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు..అల్లూరి మన్నించు..నీకోసం ఇన్నేళ్లైనా ఏమీ చేయని మమ్మల్ని క్షమించు..ఇంకా ఇంకా నీ పేరుతో రాజకీయ హామీలు ఇస్తూ అధికారం వెలగబెడుతున్న మా హామీలు నీ విషయంలో 100ఏళ్లైయినా పూర్తయ్యేటట్టు లేవు. అల్లూరి సీతారామరాజుకి సముచిత స్థానం దక్కేవరకూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక మొబైల్ న్యూస్ యాప్ తరపున పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటిస్తున్నాం..జై అల్లూరి జై జై అల్లూరి..జోహార్ అల్లూరి..!