వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-05-09 11:12:36
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net)సంపాదకులు, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సచివాలయంలో వారం రోజుల్లో పది మంది ఉద్యోగులు మ్రుతిచెందితే వారి విధులను ఒక పూటకు తగ్గించిన ప్రభుత్వం రాష్ట్రంలో పదుల సంఖ్యలో జర్నలిస్టులు కరోనా వైరస్ తో మ్రుతిచెందినా జర్నలిస్టుల విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడం శోచనీయమన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ తక్షణమే హెల్త్ ఇన్స్యూరెన్స్ రెవిన్యువల్ చేయడంతోపాటు, అవి పనిచేయడానికి వీలుగా అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల కాలపరిమితి ముగిసిపోయిందని, అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులతో డెస్క్ జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి రాష్ట్రంలో ఏం జరుగుతుందో సమాచారం మీడియా, ప్రసార మాద్యమాల ద్వారా అందిస్తున్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కోవిడ్ వేక్సిన్ తొలి ప్రాతిపదికన వేయాలన్నారు. కరోనాతో మ్రుతిచెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని తక్షణమే అందజేయాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టులు కూడా విధి నిర్వహణకు బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలన్నారు. నిత్యం శానిటైజర్లు వినియోగించాలన్నారు. మీ ఆధారపడి వెనుక కుటుంబాలున్నాయనే విషయాన్ని ప్రతీ జర్నలిస్టూ గుర్తించాలని సూచించారు.