ఈఎన్ఎస్ ఎఫెక్ట్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయో మెట్రిక్ నిలుపుదల..
Ens Balu
3
Tadepalle
2021-05-11 14:35:31
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది.. కరోనా సమయంలో సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానం అమలు చేయడం వలన సిబ్బంది కూడా కరోనా వైరస్ భారిన పడుతున్నారనే విషయాన్ని.. ‘కరోనాలోనూ సచివాలయాల్లో బయోట్రిక్’ శీర్షికన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ లో న్యూస్ కార్డ్ పబ్లిష్ చేసింది. దీనితో స్పందించిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్ల బయో మెట్రిక్ విధానాన్ని నిలుపుదల చేసింది. ప్రభుత్వం మళ్లీ ప్రకటించే వరకూ బయో మెట్రిక్ అమలు చేయకూడదనే విషయాన్ని సచివాలయాలకు వర్తమానం పంపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో భయం భయంగా బయోమెట్రిక్ అటెండెన్సు వేసేవారమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ భయం తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు. నిత్యం గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి అన్ని రకాల తాజా సమాచారం అందించే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ కార్యాలయానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఫోన్లు చేసి తమ సమస్య ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడం వలన కరోనా వైరస్ భయాన్ని తొలగించారని తమ ఆనందాన్ని పంచుకున్నారు.