సచివాలయ ఉద్యోగులవి ప్రాణాలు కాదేమో..


Ens Balu
7
Tadepalle
2021-05-12 03:39:22

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని జీఓలు వర్తించడం లేదు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుంచి 11.30  మాత్రమే కార్యాలయ పనివేళలు కుదించి విధులు నిర్వహించాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.. తీరా దానిని గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగులవి ప్రాణాలు కావని ప్రభుత్వం భావించి తమలు అమలు చేయలేదని.. దీనితో ఎప్పటి మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ విధులు నిర్వహించాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల గ్రామాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ కోవిడ్ వేక్సినేషన్ విధులు కూడా సచివాలయ సిబ్బందే చేపడుతున్నారు. అందులో గర్భిణీలు, బాలింతలు కూడా విధులు నిర్వహిస్తుండటం విశేషం. విజయనగరం లాంటి జిల్లాల్లో సచివాలయ సిబ్బందికి కూడా ఆ జిల్లా కలెక్టర్ డా.హరిజవర్ లాల్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేశారు తప్పా చాలా జిల్లాల్లో మాత్రం కలెక్టర్లు సచివాలయ సిబ్బందికి ఆ వెసులుబాటు అమలు చేయకపోవడం విశేషం. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ జిఓనైనా అమలు చేయడంలో విజయనగరం జిల్లా ఎప్పుడూ ముందే వుంటుందనే విషయం ఇపుడు అందరికీ తెలిసొచ్చింది. జిల్లా కలెక్టర్ల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ తాము ఎప్పటిమాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు. పంచాయతీ కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగుల కంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందికే కరోనా నుంచి ప్రమాదం అధికంగా వుంటుంది. ప్రతినిత్యం ఏదో పనిపై గ్రామస్తులు సచివాలయానికి వస్తూనే ఉంటారు. ఎవరి దగ్గర కరోనా వుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా భయపడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి భయకరమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో 80శాతం సచివాలయాల్లో కనీసం శానిటైజర్లు ఏర్పాటు చేయలేదు...సిబ్బందే స్వయంగా ఎవరి శానిటైజర్ వారు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. మరో విచిత్రం ఏంటంటే సోడియం హైపోక్లోరైడ్ ద్వావణాన్ని కూడా స్పేయింట్ బాటిళ్లలో తెచ్చుకొని తాము కూర్చున్న సీటు చుట్టూ చల్లుకుంటున్నారు సచివాలయ సిబ్బంది. ఇక సోడియం హైపోక్లోరైడ్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిందని సచివాలయ కార్యదర్శిలే చెబుతున్నారు.. అది లేకపోవడం వలనే బ్లీచింగ్ ఫౌడర్ చల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. కాకపోతే ఈ సమయంలో ప్రభుత్వం కల్పించి వెసులుబాటు ఒక్కటే సచివాలయాల్లో కరోనా తగ్గేంత వరకూ బయో మెట్రిక్ నిలుపుదల చేయడం.. అది తప్పా మరే ఇతర సదుపాయాలు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం కల్పించడలేదు..   ఇటీవలే కొన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కరోనాతో మ్రుత్యువాత పడినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. పంచాయతీల్లో వుండే శానిటేషన్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు గ్రామాల్లో పారిశుధ్య, అత్యవసర క్లోరినేషన్ పనులు నిర్వహించాల్సి వుంది. కానీ అన్ని సచివాలయాల్లోని అన్ని శాఖల సిబ్బంది ప్రస్తుతం కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తున్నారు. అన్నిప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం కరోనా సమయంలో ప్రభుత్వం కల్పించిన వెసులు బాటు సచివాలయ సిబ్బందికి అమలు చేయకపోవడం వలన సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులవే తప్పా..మావి ప్రాణాలు కావా అని ప్రశ్నిస్తున్నారు. బహుసా ప్రొభిషన్ లో వున్న తమని ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం వలనే, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కరోనా సమయంలో కార్యాలయ పనిసమయాల్లో మినహాయింపు ఇచ్చి తమను పక్కన పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఈ శాఖ కమిషనర్ గిరిజాశంఖర్ లు ఏ విధమైన చర్యలు తీసుకుంటో వేచిచూడాలి..!