టిఎన్ఆర్ కుటుంబాని అండగా ఐడ్రీమ్ మీడియా..


Ens Balu
1
Hyderabad
2021-05-13 13:26:45

ఏదైనా మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టు మ్రుత్యువాత పడితే ఆరోజు సంతాపం తెలిపి, ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసి  చేతులు దులుపుకోవాలని చూసే మీడియా సంస్థలున్న ఈరోజుల్లో.. ఐడ్రీమ్ మీడియా తమసంస్థ కోసం పనిచేసే వారి బాధ్యత అంతా మాదేనని నిరూపించింది.  నటుడు, ప్రముఖ యాంకర్‌,  టీఎన్‌ఆర్‌ని కరోనా కాటు వేస్తే..ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ సంస్థ చైర్మన్ చిన్నవాసుదేవ ముందుకి వచ్చారు. స్వయంగా ఆయన టిఎన్ఆర్ ఇంటికి వెళ్లి రూ.10లక్షలు ఆర్ధిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా వారి పిల్లల చదువు బాధ్యతను కూడా తమ సంస్థే భరిస్తుందని భరోసా ఇచ్చారు.  మీడియా సంస్థలో పనిచేసిన ఒక జర్నలిస్టు కోసం సదరు సంస్థ యజమాని నేరుగా వచ్చి కుటుంబం రోడ్డున పడకుండా చేసిన సహాయం నేడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఎన్నో మీడియా సంస్థల యాజమాన్యాలకు కనువిప్పుగా కూడా మారింది. చిన్నవాసుదేవ లాంటి చైర్మన్ లు ఉన్న మీడియా సంస్థలుంటే జర్నలిస్టులకు ఉద్యోగాలకు, జీవితాలకు భరోసా ఉంటుందనే భావన నేడు జర్నలిస్టుల్లో వ్యక్తమవుతుంది.