మనుషులకు దూరంగా ఉండండి..
Ens Balu
3
Tadepalle
2021-05-15 01:54:43
కొన్ని వందల వేల సంస్క్రుతీ సంప్రదాయాలను, ప్రేమాభిమానాలను, కరోనా వైరస్ మటు మాయం చేసింది.. మనుషుల కలిసుండటాన్ని చూసి కన్నుకుట్టుందో ఏమో..వారి మధ్య దూరాన్ని ఖచ్చితంగా పెంచాలని నిర్ణయించుకుంది..అంతే బౌతిక దూరం పాటించకపోతే నేను మీలో ప్రవేశిస్తానని భయపెట్టి మరీ చంపుతోంది.. మనం బతికుంటే బలుసాకైనా తినొచ్చునని అంతా ఒక నిర్ణయానికి వచ్చేలా చేసింది..మనుషులకు దూరంగా ఉండకపోతే తప్పదన్నట్టుగా మార్చేసింది ఈ కరోనా. ప్రపంచ వ్యాప్తంగా వీదేశీ సంస్క్రుతి షేక్ హేండ్ కి శాస్వతంగా చరమగీతం పాడేలా చేసింది. మాయదారి కరోనా వైరస్ ప్రవేశించాక ఎన్నడూ వినని వార్తలు, ముందెన్నడూ కనని వైపరీత్యాలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి.. అయినా కరోనాని జయించడానికి ప్రజలు, ప్రభుత్వాలు ఎదురెళ్లి పోరాటం చేస్తూనే ఉన్నారు..అదే సమయంలో ఇహలోక దైవ సహాయం ఎలా వుంటుందో కూడా సోనూసూద్ లాంటి వారి ద్వారా యావత్ ప్రపంచం మొత్తం తెలుసుకునేలా చేసింది ఈ కరోనా..!