ఆనందయ్య ఆయుర్వేద వైద్యవిధానం సరైనదే..
Ens Balu
7
Tadepalle
2021-05-22 02:38:32
కరోనా వైరస్ ను మానవ శరీరం నుంచి బయటకు పంపించడానికి నెల్లూరు క్రిష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు సరైనదేనని వాదన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చాలాగట్టిగా వినిపిస్తున్నారు. ఈ ఆయుర్వేద మందులో వినియోగించేవన్నీ నిత్యం మన కళ్లముందు ఉండేవనని, ముఖ్యంగా ఈ మందు ద్వారా వ్యాధినిరోధకశక్తి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆనందయ్య మందుకోసం వినియగించే ఆయుర్వేద దినుసులు ఏవిధంగా పనిచేస్తాయనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయుర్వేద వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ మందు తీసుకున్నవారందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడం తో ఇపుడు భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. ఇప్పటికే ఈ మందును పరీక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితోపాటు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కేంద్రప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ మందుతీసుకుని నెగిటివ్ వచ్చిన వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో జనాబా వేలాది ఆ ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు కాస్త తేడాగా చూపించే పనిలో కూడా పడ్డాయి. మందు తీసుకున్నవారంతా తాము బాగానే ఉన్నామని చెబుతున్నప్పటికీ ఎవరైనా కాస్త తేడాగా చెప్పకపోతరా అనే కోణంలో తేడాగా వ్యవహరించే మీడియా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అలాంటి మీడియాను తెలుగుప్రజలంతా సోషల్ మీడియా వేదికగానే అమ్మనా బూతులు తిడుతున్నారు. మేము కరోనా వైరస్ నుంచి బతికి బట్టకట్టడం మీడియాకు ఇష్టం లేని కారణంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు ప్రాణాలను కాపాడుతున్న ఆయుర్వేద మందును అవగాహన లేని మీడియా సంస్థలు నాటు మందు అంటూ వెటకార దోరణికి తెరలేపడటం పైనా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా క్రిష్ణపట్నం ఆనందయ్య మందు వాడిని వారికి మంచి ఫలితాలు వస్తూనే ఉన్నాయి. ఈ మందుకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభిస్తే..లక్షలాది మందికి ఈ మందు చేరి కరోనా వైరస్ ని తరమికొట్టడానికి ఆస్కారం వుంటుందనే వాదన దేశవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఆనందయ్య కరోనా వైరస్ కి ఇచ్చిన ఆయుర్వేద మందు వలన ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రభుత్వాలు ద్రుష్టిసారించడం శుభపరిణామంగా కనిపిస్తున్న ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఆశక్తి కరంగా మారింది..