ప్రభుత్వ శాఖల్లో గ్రామ సచివాలయశాఖ లేనట్టుంది..
Ens Balu
10
Tadepalle
2021-05-22 06:26:46
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ శాఖలూ ఈ నెలాఖరు వరకూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలి. అలాకాకుండా 12 తరువాత కార్యాలయంలో ఉండాలంటే ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక పాసులుండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ చేసిన చేసిన ఉత్తర్వులు ఇవి. కానీ ఈ ప్రభుత్వ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నట్టుగా కనిపించలేదు.. అందుకే గ్రామ సచివాలయ ఉద్యోగులంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ యధాస్తితిగా గర్భీస్త్రీలు, బాలింత ఉద్యోగిణిలతో సహా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలతో సమానంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసి వాటి నిర్వహణను జిల్లాల్లోప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ల(గ్రామ సచివాలయాలు)కు అప్పగించింది. అయినా ప్రభుత్వం విడుదల చేసిన కొత్తగా విడుదలచేసిన కార్యాలయ పనిగంటల జీఓలు గ్రామ, వార్డు సచివాలయాలకు వర్తింప జేయడంలేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు(గ్రామసచివాలయం) ప్రభుత్వ శాఖలతోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ కరోనా సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన పనిగంటల ఆదేశాలను వర్తింప జేస్తుంటే.. కొన్ని జిల్లాల్లో గర్భిణీ స్త్రీలు, బాలింత ఉద్యోగులతో సహా పూర్తి పనిగంటలుతో పనులు చేయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఒక్క కారణమే రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు, ప్రత్యేక ఆదేశాలు గ్రామ సచివాలయాల్లో అమలు చేయలేదని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైన జీఓ విడుదల చేసినపుడు దానిని జిల్లా కలెక్టర్లు ఆయాశాల ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేయస్తున్నారు. కానీ విచిత్రంగా ఆ సమాచారం కొన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు మాత్రం చేరడం లేదు. కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన కుదించిన పనిగంటల సమయం ఒక్కటే కాకుండా ఇతర ముఖ్యమైన విషయాలకు సంబంధించిన జీఓలు రాకపోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే అభివ్రుద్ధి కార్యక్రమాలు, లోపాలు, పరిపాలన సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ ద్వారా అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఇతర శాఖల అధికారుల ద్రుష్టికి తీసుకెళుతూ చైతన్యం తీసుకొస్తోంది. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థ జరిగే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన వార్తలను తాజా తాజాగా అందిస్తోంది. కొన్ని సందర్భల్లో కొన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఈఎన్ఎస్ అందించిన సమాచారం ఆధారంగా సత్వరమే చర్యలు చేపడుతున్నా..మరికొన్ని జిల్లాలో అమలు చేయడానికి ఎందుకనో ద్రుష్టి పెట్టడం లేదు. ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి తాజాగా పెంచిన పనిగంటల సమయాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కుదించిన పనిగంటల ఆదేశాలను అమలుచేస్తారా..లేదంటే అది ప్రభుత్వశాఖలో లేదన్నట్టుగా వారికి ప్రత్యేక ఆదేశాలిచ్చి పనిచేయిస్తారా అనేది వేచి చూడాలి..