ఆన్ లైన్ లో శ్రీ కనక దుర్గమ్మ సేవలు..


Ens Balu
1
Vijayawada
2021-05-30 04:04:51

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేయున్న శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివర్ల దేవస్థానంలోని శ్రీ కనక దుర్గమ్మ తల్లి వారి సేవలను ఆన్ లైన్ ద్వారా భక్తులకు చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు ఆలయ ఈఓ డి.బ్రమరాంబ తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో  భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ పి.అర్జునరావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గుగూల్ మీట్ లింక్ ద్వారా  google meet link (https://meet.google.com/nuw-kwsy-xsc)అమ్మవారి ఆలయంలో జరిగే అన్ని పూజల్లో భక్తులు పాల్గొని తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరుతున్నారు.