నేడు నెరవేరనున్న డా.వైఎస్సార్ కల..


Ens Balu
2
Tadepalle
2021-05-31 05:05:44

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రియతమ నేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయం నేడు నెరవేరబోతుంది. ఏరోజైతే ప్రజలకు ఉచిత వైద్యం, విద్య, ఉపాది కల్పిస్తామో ఆ రోజే మనం ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు చేసినట్టు వుతుందనే మాటలను నిజం చేస్తూ రాజన్న తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8వేల కోట్ల  16 మెడికల్ కాలేజీల స్థాపనకు ఈరోజు శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతుంది. వీటితోపాటు, నర్శింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఏరియా ఆసుపత్రులకు ఈ మెడికల్ కళాశాలలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నారు. ఇకపై ప్రభుత్వ వైద్య విద్యను మరింత మంది నిరుపేద, తెలివైన విద్యార్ధులు అభ్యసించడానికి వీలుపడుతుంది. 16 కాలేజీలంటే సుమారుగా 1600 మెడికల్ సీట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వస్తున్నాయంటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంత దూరద్రుష్టితో ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో అధిక సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గర విషయం. తద్వారా గిరిజన విద్యార్ధులు కూడా అధిక సంఖ్యలో వైద్య విద్యను అభ్యసించడానికి వీలు కలగడంతోపాటు, వారు నివశించే ప్రాంతాల్లోని గిరిజనులకు వారే వైద్యసేవలు చేసే అవకాశం దక్కుతుంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు తోపాటు, అత్యాధునిక ల్యాబరేటరీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం వలన వ్యాధినిర్ధారణ, వైద్యసేవలు మరింతగా నిరుపేద ప్రజలకు మెరుగుపడనున్నాయి.