ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా జాన్తానయ్..
Ens Balu
5
Tadepalle
2021-05-31 08:36:45
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 10 వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ..ప్రజల సౌకర్యార్ధం కర్ఫ్యూని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకూ మధ్యాహ్నాం 12 గంటలవరకూ పనిగంటలు కుదించినా గ్రామ, వార్డు సచివాలయ శాఖ సిబ్బందికి మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ డ్యూటీలు వేస్తుండటం విశేషం. ఈ విషయంలో రాష్ట్రంలో ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.. పైగా సచివాలయ సిబ్బందికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరుగంట వరకూ ప్రత్యేక డ్యూటీలు కోవిడ్ టీకా కేంద్రాల వద్ద వేస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్లను కోవిడ్ డ్యూటీలకు వినియోగించ రాదని సిఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు వారిని కూడా వదిలిపెట్టకుండా డ్యూటీలు వేస్తున్నారు. దీనితో ప్రజలు వివిధ సర్టిఫికేట్ల కోసం సచివాలయాలకు వెళ్లినా అక్కడ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడంతో ప్రజలు వెనుతిరగాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఒక్క గ్రామసచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయకపోవడం ఏంటని.. వీరు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కారా..లేదంటే అన్ని ప్రభుత్వ శాఖలకూ ఉన్న ప్రత్యేక పనిగంటల సమయం కేవలం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికే అమలు చేయకూదని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. వాస్తవి విషయాలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లపోవడం, ప్రభుత్వ ఉత్తర్వులు గ్రామసచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు చేయకపోవడం, వాటిని వీరి వరకూ చేర్చకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది.