విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్..


Ens Balu
2
Tadepalle
2021-06-03 04:15:30

విదేశాలకు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు 45 ఏళ్లలోపు ఉన్నా వారికి వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారనివైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను మార్గదర్శకాలు జారీచేశామన్నారు. విదేశాలకు వెళ్లేవారు ఆధార కార్డుకు బదులు పాస్ పోర్టు నెంబర్ ను కొవిన్ అప్లికేషన్ లో పొందుపరుచుకోవాలని సూచించారు. విదేశాల్లో పాస్ పోర్టుకు జతజేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. దీనివల్ల ఆధార్ నెంబర్ తో వ్యాక్సిన్ తీసుకున్న వారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయా జిల్లా కలెక్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతమున్న నిబంధనల దృష్ట్యా పాస్ పోర్టు నెంబర్ జతజేసి రివైజ్డ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. ఇదే విషయం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శితో చర్చించామని, కొవిన్ వ్యాక్సిన్ అప్లికేషన్ లో పాస్ పోర్టు నెంబర్  ను జతచేసేలా మార్పులు చేయాలని కోరామని తెలిపారు. కేంద్రం అందుకు అంగీకరించిన వెంటనే పాస్ పోర్టు జతచేసిన వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకిచ్చే స్టయిఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ రాష్ట్ర్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులు తమకిచ్చే స్టయిఫండ్ ను పెంచాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామని తెలిపారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్డర్లు గత ఏడాది సెప్టెంబర్ లో విధుల్లోకి చేరారన్నారు. 800 పీజీ విద్యార్థుల వినతులపై చర్చించి వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.