రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు` పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా నిరుపేద మహిళల పేరున నివేశన స్దలాలు రిజిస్ట్రేషన్ చేయించి కనివిని ఎరుగని విధంగా పేదవారి స్వంతింటి కలను సాకారం దిశగా ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వె.ఎస్. జగన్మోహనరెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంనుంచి వర్చువల్ విధానంలో తొలిదశలో వైఎస్‌ఆర్ జగనన్న కాలనీలలో 15.60 లక్షల గృహాలను నిర్మించడానికి భూమి పూజ శంకుస్దాపనలు చేసారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో మంచి కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులతో శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే సంకల్పించి అక్కాచెల్లెమ్మల పేరిటి ప్దలాలు రిజిస్ట్రేషన్ చేయించి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. మొదటి దశ శంకుస్దాపన, గృహ నిర్మాణాల ప్రారంభోత్సవాలు ఈనెల 3వ తేదీనుంచి 10వ తేదీవరకు కొవిడ్ నిబంధనలు ప్రకారం పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 31 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇల్లు నిర్మించి,అందించే బృహత్తర కార్యక్రమన్నారు. మొదటి దశ గృహ నిర్మాణాలు జూన్ 2022 నాటికి పూర్తి చేయాలని, రెండవ దశలో 12లక్షల 70 వేలు గృహాలను జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.పిఎంఎవై అనుసంధానంలో గృహ నిర్మాణాలు వేగవంతంచేసి యుద్ద ప్రాతిపదికను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది కుటుంబాలకు గృహాలు మంజూరు చేసామని ఇంటికి నలుగురు చోప్పున వెరసి మొత్తం కోటి 24 లక్షల మందికి గృహయోగం కలుగుతుందన్నారు. 17,005 లేఅవుట్లలో 32,900 కోట్ల వ్యయంతో నిర్మాణాలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
వీటిలో సుమారు రూ 4,120 కోట్లతో త్రాగునీటి వసతులు, రూ 22,587 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సి.సి రోడ్లు, రూ 4,986 కోట్లతో అండర్ గ్రౌండు విద్యుత్ పౌకర్యం, రూ 627 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ పౌకర్యం, ఇతరు మౌలిక సదుపాయాలైన ఆఆర్‌బికె, గ్రామ విలేజ్ క్లినిక్ వంటి సదుపాయాలు కల్సించడం జరుగుతుందన్నారు. రూ 567 కోట్ల పిజికల్ ఇన్‌ప్రాస్టక్చర్ వపతులు రానున్నాయన్నారు. సౌకర్యాలు మంచి నాణ్యతా ప్రమాణాలతో ఉండేలా మరో అడుగు ముందుకు వేసామన్నారు. మంచి నాణ్యతా ప్రమాణాలు అన్నింటిలోను పాటించడం జరుగుతుందన్నారు. కాలనీలు పూర్తి అయిన పిదప ఒక్కొక్క ఇంటి విలువ రూ 5 లక్షలనుంచి సుమారు రూ15 లక్షలవరకు ఉంటుందన్నారు. మూడు రకాల ఆప్షన్లులో లబ్దిదారులు తమకు ఇష్టమైన విధంగా 340 చదరపు అడుగుల విస్తిర్ణంలో నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవచ్చునన్నారు. ఇంటి నిర్మాణంలో ఒక పడక గది, ఒక హాలు కిచెన్, వరండా, వసతులు వస్తాయని అదేవిధంగా రెండు ప్యాన్లు, రెండు ట్యూట్‌సైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్ ట్యాంకు కూడా అందించడం చేయడం జరుగుతుందన్నారు. కరోనా కష్ట కాలంలో ఈ కాలనీ ఇళ్ల నిర్మాణాలవల్ల గ్రామీణ ఆర్దిక వ్యవస్ద బలోపేతం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. 30 రకాలువారికి చేతినిండా ఇటుకలు, తయారీ, ఇంటి నిర్మాణ పనులు లబించి ఆర్దిక వ్యవస్ద బలపడనుందన్నారు. సిమ్మెంటు బస్తా రూ. 225 లకే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల స్దాయి మెటిరియల్‌ను గోడౌన్లు భద్రపర్చి లబ్దిదారులు అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి రూ 1,80,000 గ్రాంటుగా అందించడం జరుగుతుందన్నారు.
ఇళ్ల స్దలాలు జాబితా తమపేరు లేదని ఎవ్వరు బాధపడాల్సిన అవసరంలేదని మరలా దరఖాస్తు చేసుకుంటే 90 రోజులలో ఇంటి స్దలాన్ని కొనుగోలు చేసి అందించడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. ఊహకందని రీతిలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పూర్తిస్దాయిలో పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు నాల్గవ జాయింట్ కలెక్టరు పోష్టును మంజూరు చేసామని త్వరలో వీరి నియమాకానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరు లబ్దిదారులుకు అన్ని విధాలుగా చేయూతను అందించి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా పూర్తిస్దాయిలో చర్యలు చేపడతారన్నారు. ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాదాన్యతగా తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 74 వేలమంది లబ్దిదారులుకు స్దలాలు కోర్డు కేసులు మూలంగా ఇప్పటికీ మంజూరు కాలేదని, కోర్డులు తెరచిన పిదప వారికి న్యాయం చేసి స్దలాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌నారాయణ గుప్తతో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి అధికారులు, లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.