విజిలెన్స్ కేసుల్లో రూ.9.90 కోట్ల వసూలు..


Ens Balu
2
Tadepalle
2021-06-03 16:28:56

ఆంధ్రప్రదేశ్ లోని 89 ఆసుపత్రులపై విజిలెన్స్ తనిఖీలు చేసి, 66 కేసుల్లో రూ.9.90 కోట్ల వరకూ వసూలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో 1,187 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. 11,605 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 93 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వారి పేరున ఫిక్సడ్ డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెలకు రూ.5 వేలు వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనాధలైన చిన్నారుల గుర్తింపు కొనసాగుతోందన్నారు.