పలు రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ..
Ens Balu
2
Tadepalle
2021-06-03 16:36:32
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయాలని గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ టీకా వేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారన్నారు. ఇదే విషయమై దేశంలోని ముఖ్యమంత్రులందరూ కేంద్రాన్ని కోరాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినట్లు సింఘాల్ వివరించారు. ఈ ఏడాది జనవరి 16 తేదీన చేపట్టినట్లు దేశ ప్రజలందరికీ కేంద్రమే వ్యాక్సిన్ వేయాలన్నారు. దీనివల్ల దేశ ప్రజలకు మేలు కలుగుతుందని ఆ లేఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు. కోవిడ్ విషయంలో ఎప్పటికప్పుడు సీఎం రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారని వివరించారు.