20మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ..
Ens Balu
2
Tadepalle
2021-06-04 16:26:18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం ఇది రెండవ సారి. అయితే చాలా జిల్లాల్లో సమర్ధవంతంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీచేయడం విశేషం..కాగా రెండేళ్లు, మూడేళ్లు దాటిన ఐఏఎస్ అధికారుల పేర్లను ఈ బదిలీల్లో చేర్చపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జేసి-4(హౌసింగ్) కి కొందరు ఐఏఎస్ అధికారులను నియమించింది. కీలకమైన ఏపీఈపిడిసిఎల్ లాంటి సంస్థకు అధికారిని నియమించకపోగా లోపల ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం.