రాష్ట్రంలో 1.64 కోట్ల వేక్సిన్లు పంపిణీ..


Ens Balu
4
Tadepalle
2021-06-05 14:10:12

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 1,06,47,444 డోసులు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వాటిలో 25,65,162 మందికి రెండు డోసులు, 55,13,120 మందికి ఒక డోసు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద శుక్రవారం సాయంత్రానికి 3,22,220 డోసుల స్టాక్ ఉందని, వాటిని శనివారం పంపిణీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు పైబడిన వారికి 53.08 శాతం మేర కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి 1,33,07,889 మంది ఉండగా, వారిలో. 18,66,082 మందికి రెండు డోసులు, 47,91,032 మందికి ఒక డోసు వేశామన్నారు. 45 ఏళ్లు పైబడిన జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక టీకా వేసినట్లు ఆయన తెలిపారు.