ఇక ఉదయం 6 నుంచి 2 గంటల వరకూ..


Ens Balu
2
Tadepalli
2021-06-07 17:22:17

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నివారణకు విధించిన 144 సెక్షన్, కర్ఫ్యూను జూన్ 20 వతేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ నెల 11 వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ 144 సెక్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. కర్ఫ్యూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ... ఇదివరకటి నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందన్నారు. మరికొద్ది రోజులు కర్ఫ్చూ పొడిగిస్తే మరింత సత్ఫలితాలు వస్తాయని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతం లోపలే ఉంటోందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో జూన్ 6వ తేదీనాటికి  21,130 మంది చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో 17,944 మంది(84.92 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,659 మంది కరోనా చికిత్స పొందుతుంటే, వారిలో 6,473 మంది (67 శాతం) ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందుతున్నారన్నారు. రోజు రోజుకూ ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్సలు పొందే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు.