చిరువ్యాపారుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
3
Tadepalle
2021-06-08 12:33:45

రాష్ట్రంలోని చిరువ్యాపారులు రుణాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతోనే జగనన్న తోడు పథకం కింద 2వ విడతలో   3.70 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాలలో  రూ. 10వేల చొప్పున రూ. 370 కోట్లను  విడుదల చేసినట్లు   ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకంలోని లబ్దిదారులకు  కంప్యూటర్ బటన్ నొక్కి  ఖాతాలలోకి  నగదు జమ చేసారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తాను పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలు స్వయంగా చూశానని వారిని ఆదుకోవడాని ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.   గత ఏడాది  జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది  రుణ సౌకర్యం పొందారని  అన్నారు.  అర్హత ఉన్నవారందరికి సహాయం చేస్తున్నామని  సకాలంలో వడ్డీ చెల్లించే వారికి  తిరిగి వారి ఖాతాలలోకి  వడ్డీ జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్,  పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆప్కాబ్‌ పర్సన్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్త, సెర్ప్‌ సీఈఓ  రాజాబాబు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాధరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.