అనాధలను ఆదుకోవడమే తన లక్ష్యం..గంట్ల
Ens Balu
3
Dabagarden Main Road Bus Stop
2020-06-22 13:13:07
విశాఖ పాతనగరంలో ఎంతో మంది అనాధలకు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ పలువురు కి బాసటగా నిలిచిన శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థకు గడచిన 2నెలల్లో లక్ష రూపాయలు తనవంతు విరాళంగా అందించినట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ విజేఫ్ ప్రెస్ క్లబ్ లో రూ.25 వేల చెక్ ను ఆ సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావుకు శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అనాధ ఆశ్రమానికి 50నుంచి 75 వేల రూపాయలు తాను విరాళంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.. దీంతోపాటు మంచాలు, ఆయా సందర్భాల్లో నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తు లో కూడా తనసాయం కొనసాతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.