ఆర్బీకేల్లోనే ధాన్యం అమ్ముకోవాలి..


Ens Balu
0
Tadepalle
2021-06-10 15:38:24

రాష్ట్ర వ్యాప్తంగా రబీ 2021 పంటకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్ధత్తు ధరకు రైతుల నుండి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ సెక్రటరీ మరియు కమీషనర్ కె.శశిధర్ స్పష్టం చేశారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు,కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థిలున్నప్పటికీ వాటిని అధికమించి రబీలో రైతులు పండించిన ప్రతి ధాన్యాపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్ధత్తు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.కావున ఏరైతు కూడా దళారులకు లేదా మధ్యవర్తులకు,మిల్లర్లకు కనీస మద్ధత్తు ధరకంటే తక్కువకు లేదా తూకంలో తేడాతోగాని అమ్ముకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఒక వేళ మద్ధత్తు ధరకంటే ఎక్కువ ధర వచ్చినచో బయట అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉందని చెప్పారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇ-పంటలో ఉన్నరైతుల సమాచారం ఆధారంగా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు వాటి ద్వారా రైతు కల్లం వద్దనే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని ఇందుకుగాను 7వేల 706 రైతు భరోశా కేంద్రాలకు 3936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానించి ఈకొనుగోలు ప్రక్రియను చేపట్టడం జరిగిందని ఇఓ సెక్రటరి శశిధర్ వివరించారు.

ఇప్పటి వరకూ 3లక్షల 78వేల 206 మంది రైతులు వారి వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో “Paddy Procurement Online Portal”నమోదు చేసుకున్నారని తెలిపారు.ఈవిధంగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ప్రతి రైతుకు ధాన్యం కొనుగోలు చేసే తేది కూపన్లను జారీ చేయడం జరుగుతోందని ఇప్పటి వరకూ ఆవిధంగా 2లక్షల 84వేల 129 మంది రైతులకు కూపన్లు జారీ చేశామని శశిధర్ వెల్లడించారు. 2020-0-21 ఏడాది రబీ పంటకాలానికి గాను 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సుమారు 8వేల 600కోట్ల రూ.లతో కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 3లక్షల 78వేల 206 మంది రైతుల నుండి 25లక్షల 25వేల927 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4వేల 729కోట్ల రూ.లతో కొనుగోలు చేయడం జరిగిందని ఇఓ సెక్రటరీ శశిధర్ వెల్లడించారు. 2018-19లో 27లక్షల 52వేల 702 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని4వేల838కోట్లతోను,2019-20లో 34లక్షల 73వేల 414 టన్నుల ధాన్యాన్ని 6వేల 331కోట్లతో కనీస మద్ధత్తు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని మీడియాకు వివరించారు.ఇప్పటి వరకూ రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో 12లక్షల 26వేల 538 టన్నులు,తూర్పు గోదావరి జిల్లాలో 6లక్షల 29వేల 736 టన్నులు,కృష్ణా జిల్లాల్లో 2లక్షల 69వేల 558 టన్నులు,నెల్లూరు జిల్లాలో 2లక్షల 37వేల 218 టన్నులు,గుంటూరు జిల్లాలో 71వేల 130 టన్నులు,ప్రకాశం జిల్లాలో 50వేల 320 టన్నులను కొనుగోలు చేశామని తెలిపారు.అలాగే కడప,కర్నూలు,అనంతపురం జిల్లాల నుండి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని వివరించారు.

చిత్తూరు జిల్లాల్లోను,కృష్ణా జిల్లా పెడన తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ధాన్యం ఎరైవల్స్ వస్తున్నాయని ఆధాన్యాన్ని అంతటినీ రైతుల నుండి కొనుగోలు చేసేందుకు జూలై నెలాఖరు వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని శశిధర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 3వేల 299 కోట్ల రూ.లు రావాల్సి ఉందని దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదికి,కేంద్ర పౌరసరఫరాల మంత్రికి లేఖలు వ్రాశారని శశిధర్ వివరించారు.అలాగే రైతుల నుండి కోనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉండగా ఇంకా 360కోట్ల రూ.లను ఆవిధంగా చెల్లించాల్సి ఉండగా ఆనిధులను త్వరగా విడుదల చేయాల్సిందిగా ఇప్పటికే ఆర్ధికశాఖ అధికారులకు సియం ఆదేశాలు జారీ చేశారని త్వరలో వారికి సొమ్ము చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఖరీఫ్ నుండి స్థానికంగా వినియోగించని వరి రకాలు సాగుచేయవద్దు రైతులకు విజ్ణప్తి
రాష్ట్రంలో వచ్చే ఖరీప్ సీజన్ నుండి స్థానికంగా వినియోగించని 1010,MTU 1001, NLR 145 వంటి వరి వంగడాలను సాగు చేయవద్దని రైతులందరిలో అవగాహన కలిగించేందుకు రైతు భరోసా కేంద్రాలు,స్థానిక రైతు సలహా కమిటీలు ద్వారా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ద్వారా పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపట్టనునట్టు శశిధర్ పేర్కొన్నారు.ఎందుకంటే స్థానికంగా వినియోగించని వరి వంగడాలను సాగుచేయడం వల్ల వాటిని ప్రజలు తినకపోవడం,భారత ఆహార సంస్థ కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతారని కావున అలాంటి వరి వంగడాల సాగును చేపట్టవద్దని రైతులందరికీ అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పౌరసరఫరాలశాఖ ఇఓ సెక్రటరీ కె.శశిధర్ పేర్కొన్నారు.        ఈమీడియా సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.