1.28 లక్షల తల్లులకి వేక్సినేషన్..


Ens Balu
1
Mangalagiri
2021-06-11 14:22:58

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ లో చేసిన మార్పులకు అనుగుణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది అయిదేళ్ల లోపు పిల్లలకు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకాలు వేసే పకడ్బందీగా సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,13,76,000 డోసులు పంపిణీ చేశామన్నారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామన్నారు. 45 ఏళ్లుకు పైబడిన వారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. ఇప్పటి వరకూ 45 ఏళ్లు పైబడిన జనాభాలో 53.07 శాతం మందికి టీకా వేశామన్నారు. జూన్ నెలాఖారు నాటికి రాష్ట్రంలో 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు.