రాష్ట్రంలో చురుగ్గా కోవిడ్ వేక్సినేషన్..


Ens Balu
1
Mangalagiri
2021-06-11 14:27:19

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 1,01,863 శాంపిళ్లు పరీక్షించగా 8,239 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 61 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతున్నా శాంపిళ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 10న పాజిటివిటీ రేట్ 8.29, జూన్ 11న 8.09గా నమోదైందన్నారు. రికవరీ రేటు 94 శాతంగా నమోదవుతోందన్నారు. అదే సమయంలో మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా కారణంగా జూన్ 10న 67 మంది మృతి చెందగా, జూన్ 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.  25 రోజుల కిందట 2,11,000 వరకూ కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. వివిధ ఆసుపత్రుల్లో 15,951 చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్ లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 20,500 మంది తో వైద్యలు మాట్లాడారన్నారు. గడిచి,న 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 2,592 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో వివిధ సమాచారాలకు 1,387 కాల్స్, అడ్మిషన్ల కోసం 319 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.