ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 15003 గ్రామ, వార్డు సచివాలల్లో పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సుతో సహా సుమారు 536 పై చీలుకు సేవలను రాష్ట్రవ్యాప్తంగా వున్న అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ కేవలం సుమారు 50 సేవలు మాత్రమే ఉండే ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన సేవలు ద్రువీకరణ పత్రాలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే పాస్ పోర్టుకి దరఖాస్తులు ఏ విధంగా అప్లోడ్ చేయాలనే విషయమై గ్రామ, వార్డు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. దీనితో ఏ సేవకైనా గ్రామంలోని సచివాలయాన్నే సంప్రదించేలా ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతుంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14శాఖల సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలు తెల్లవారి లెగిస్తే ఏపనికైనా సచివాలయానికే వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఒకప్పుడు ఏదైనా ద్రువీకరణ పత్రం కావాల్సి వస్తే మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పా పనులు జరిగేవి కాదు. ఇపుడు కేవలం మూడు నుంచి వారం రోజుల్లోపే పలు ద్రువీకరణ పత్రాలు ఇంటి ముంగిటే సచివాలయాల్లోనే అందుకునే పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే మిగిలిన అన్ని రకాల ప్రధాన సేవలను కూడా ఇక్కడే అందించడం ద్వారా చాలా పనులకు జిల్లా కార్యాలయాలకు కూడా తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో మరింత సులువుగా అనుకున్న ద్రువీకరణ పత్రాలను గ్రామంలోనే చేయించుకునే సౌలభ్యం కలుగుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంలోని శాఖలతోపాటు, కేంద్ర ప్రభుత్వంలోని మరికొన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లను కూడా గ్రామసచివాలయ వ్యవస్థకు అనుసంధానం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైవుంది. ఆ విధానం పూర్తయితే ఎలాంటి అనుమతులైనా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందే వీలుంటుంది. ఒకప్పుడు పాస్ పోర్టు, పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలంటే దళారులను సంప్రదించాల్సి వచ్చేది ఇపుడు ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వీటిని అందిస్తే ప్రజలకు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే బాధల నుంచి విముక్తి కలుగుతుందని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం మీసేవా కేంద్రాల్లో లభించే సేవల కంటే అత్యధికంగా సచివాలయాల్లో ప్రజలకు అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రభుత్వ యోచన. అంతేకాదు త్వరలోనే ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసి, జిల్లా కార్యాలయాలు మాదిరిగా పేపర్ లెస్ సచివాలయాలుగా కూడా మర్చే యోచన ప్రభుత్వం వద్ద ఉందనే సమాచారం అందుతుంది. అదే జరిగితే ఈ ఫైలింగ్ విధానం అభివ్రుద్ధి చెంది మోసాలకు తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందడానికి వీలుపడుతుంది..!