ఆ పరీక్షతోనే వారి సర్వీసు రెగ్యులర్..


Ens Balu
4
Tadepalli
2021-06-13 05:42:17

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడానికి ఏర్పాట్లు చకచకా చేస్తున్నది. ఇందులో భాగంగా వారికి సర్వీసు రెగ్యులైజేషన్ కు సంబంధించి శాఖా పరమైన పరీక్షలు పాసైన తరువాత వారి ప్రొహిభిషన్ పీరియడ్ ఎత్తివేసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నది. అయితే ఇక్కడ ఉద్యోగులకు ప్రధానంగా ఒక డౌట్ పట్టి పీడిస్తోంది.. ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇచ్చిన డిపార్ట్ మెంటల్ టెస్టు నోటిఫికేషన్ లో పాసైన వారినే రెగ్యులర్ చేస్తుందా.. లేదంటే ఆయా ప్రభుత్వ శాఖల విధి నిర్వహణ పరంగా ఇచ్చిన శిక్షణ పూర్తిచేసుకున్న తరువాత పెట్టిన టెస్టులు పాసైన వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తుందనే విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. మరోపక్క సచివాలయ శాఖలో ఇంకా శాఖాపరమైన శిక్షణలు మిగిలి పోయిన వారికి ఆన్ లైన్ శిక్షణను పూర్తిచేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దానికోసం శిక్షణకు సంబంచిన ఆన్ లైన్ క్లాసులను కూడా శిక్షణ మిగిలి పోయిన సచివాలయ ఉద్యోగులకు పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తుంది. చాలా మంది సచివాలయ ఉద్యోగులు శాఖా పరమైన ఉద్యోగ శిక్షణ పూర్తిచేసుకొని ఉన్నారు. ఆ శిక్షణపై ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక పరీక్ష ఏర్పాటు చేస్తుందా...లేదంటే డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించి అందులో పాసైన వారిని రెగ్యులర్ చేస్తుందా అనే విషయంపై క్లారిటీ లేకపోడంతో సచివాలయ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవలే సీఎం జగన్మోహనరెడ్డిని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసినపుడు సీఎం ఈ విషయమై బదులివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అంది ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. అప్పట్లో కరోనా కేసులు అధికంగా వుండటంతో కొన్ని బ్యాచ్చీల ఉద్యోగులకు శాఖ పరమైన శిక్షణ మధ్యలోనే ఆపేశారు. ప్రభుత్వం నుంచి ఈ రకమైన సమాధానం రావడంతో తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా లేదా అనే అనుమానాలు వారిని తొలిచేస్తున్నాయి. మరోవైపు నవంబరు నాటికి ఉద్యోగులంతా విధుల్లోకి చేరి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఆ సమాయానికి ఉద్యోగులందరి ప్రొహిభిషన్ పీరియడ్ పూర్తవుతుంది. అనుకున్న తేదీకే ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోతే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారికి ఆరునెలల ముందుగానే సర్వీసు రిజిస్టర్లు కూడా ఓపెన్ చేశారు. ఎస్ ఆర్ లు ఓపెన్ చేయడంతో అంతా వారి ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయిందని సంబర పడిన తరుణంలో ప్రభుత్వం శాఖాపరమై పరీక్షలు పాసైన వారి ఉద్యోగాలు మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పడంతో రాష్ట్ వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ప్రభుత్వం అసలు ఏ పరీక్ష ద్వారా తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తారో చెబితే దానికే తామంతా ఇప్పటి నుంచే సిద్దమవుతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ధిష్ట ప్రకటన చేస్తే తప్పా ఆ.. అర్హత పరీక్ష ఏంటనేది ఉద్యోగులకు క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు..!