ఆయనొక జర్నలిస్టు..ఎప్పుడూ సామాజిక సేవలో ఫస్టు..ఎన్నో నిశ్వార్ధ సేవలపై వార్తా కధనాలు రాసి రాసి ఆయనకి తన జీవితంలో సేవ ఒక బాగమైపోయింది. రక్తధానం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా ఇప్పటి వరకూ 64సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలువడానికి కారణమయ్యాడు. ఆయనే విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్టు కాళ్ల సూర్యప్రకాష్ (కిరణ్) అనునిత్యం ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ వస్తున్నారు. అర్ధరాత్రిలో రక్తం అవసరమైనా దానం చేయడానికి ఈయన హుటాహుటీన బాధితుల కోసం వెళతారంటే అదిమాటల్లో చెప్పలేం. ఇదంతా ఎందుకూ అంటే ఇన్నిసార్లు రక్తదానం చేసిన నిజమైన రక్తదాత మరెందరికో మార్గదర్శి కావాలన్న చిన్న సంకల్పమే ఆయన కోసం ఇంతలా రాసేలా చేసింది. అలాంటి రక్తదాత, సమాజ సేవకుడు
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండటం గర్వకారమని భావించిన యూనియన్ కార్యవర్గం కిరణ్ ను సోమవారం ప్రత్యేకంగా యూనియన్ కార్యాలయంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని సత్కరించి గౌరవించింది. ఈ సందర్బంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానంపై అవగాహన పెంచుకొని అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దాతలుగా ముందుకు రావాలన్నారు. అసోసియేషన్ సభ్యులు కిరణ్ అనేక మందికి రక్తదానం చేసి
ఎంతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యన్నారాయణ(సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులు వెంకట సూరి అప్పారావు(శ్రీనివాసరావు),రామకృష్ణ,ప్రధాన కార్యవర్గ సభ్యులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.