కోవిడ్ వారియర్స్ కి ప్రభుత్వ అండ..


Ens Balu
3
తాడేపల్లి
2021-06-14 15:45:08

కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..  విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందికి భారీ మొత్తంలో ఎక్స్ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీచేసిందన్నారు. కొవిడ్‌ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సు కుటుంబానికి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎన్ఓ, ఎమ్‌ఎన్ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌ గ్రేషియా చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. తక్షణమే ఎక్స్‌ గ్రేషియా అందేలా జిల్లా కలెక్టర్లకు అధికారం అప్పగించిందన్నారు. ఇతర ఇతర బీమా పరిహారాలు పొందినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియో అందజేస్తామన్నారు.