గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే..


Ens Balu
2
Tadepalle
2021-06-16 15:16:43

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై  స్టే విధించింది.. ఇంటర్వ్యూను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో వాల్యుయేషన్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప‌బ్లిక్ క‌మిష‌న్‌ను ఆదేశించింది.  కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ గురించి చివరి దశలో చెప్పారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.