ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యకు చాలా ఏళ్ల తరువాత మహర్ధశ పట్టబోతుంది.. ఇప్పటివరకూ డిగ్రీకాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యకోసం క్రుషిచేసిన అధికారులు లేకుండా పోయారు. దీనితో ఉన్నత విద్య రాష్ట్రంలో అంతంత మాత్రంగానే సాగుంది.. ఏపీలోని ఉన్నత విద్య దేశానికే ఆదర్శం కావాలన్నా, ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు అందుబాటులోకి రావాలన్నా ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరిస్తే తప్పా అదిజరగదు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం డేరింగ్ అండ్ డేషింగ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ను రంగంలోకి దించింది. ఈయన ఉన్నత విద్యకు కమిషనర్, డైరెక్టర్ టెక్నకల్ ఎడ్యుకేషన్ గా చేరిన వెంటనే శాస్వత అభివ్రుద్ధికి, ప్రక్షాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రీజియన్ కేంద్రాలు, వాటి కింద వున్న ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, సదుపాయాలు, విద్యావ్యవస్థ, ఆన్ లైన్ విద్య, ఇలా అన్ని విషయాలపై ఒకేసారి ద్రుష్టి కేంద్రీకరించారు. దీనితో ఉన్నత విద్యలో ఎన్నడూ రానంతగా చురుకుదనం, కొత్త కొత్త విధానాలు అమలవుతున్నాయి. కరోనా సమయంలో డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. మళ్లీ విద్యార్ధులకు ఆ స్థాయిలో విద్య అందించాలంటే శాఖా పరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్పా విద్యార్ధుల భవిష్యత్తుకి బాటలు వేయలేమని ప్రభుత్వం భావించి ఆ దిశగా తన దైన స్టైల్ లో కార్యాచరణ తో ద్రుష్టిని కేంద్రీకరించారు కమిషనర్. ఈ ఉన్నతాధికారి విధుల్లోకి చేరుతూనే కరోనా సమయంలో ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని పసిగట్టారు. వెంటనే జోనల్ స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాలు అనంతరం రూట్ మ్యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతోపాటు సదుపాయాలు, సిబ్బందికొరత, భవనాలు, విద్యావిధానం ఇలా అన్ని అంశాలను గాడిలోపెట్టడానికి కార్యాచరణ రూపొందించారు. ఉన్నత విద్య కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వచ్చే ఫలితాలు ఎలావుంటాయో ఈయన జిల్లా కలెక్టర్ గా చేసిన జిల్లాల్లో ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నెమరు వేస్తూనే వున్నారు. ఇపుడు విద్యార్ధుల భవిష్యత్తుకు కూడా బంగారు బాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కమిషనర్ పోలాభాస్కర్ పుణ్యమాని విద్యార్ధుల విద్యావిధానం, నాణ్యమైన విద్య, కళాశాలల్లో మరింతగా అభివ్రుద్ధి చెందుతాయని అన్ని వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి..!