25న డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల సమావేశం..
Ens Balu
1
Tadepalle
2021-06-22 12:28:05
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనరం జిల్లాల డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజిల ప్రిన్సిపాళ్లతో ఈనెల 25న విశాఖలో జోనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డా.పోలా భాస్కర్ తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నతవిద్యలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత కాలేజీల్లో నెలకొన్న సమస్యలు, ఏర్పాటు చేయాల్సిన వసతులపై ప్రిన్సిపాళ్లతో చర్చిస్తామన్నారు. మొదటిగా ఉత్తరాంధ్రాలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన తరువాత విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రత్యేకంగా స్టేట్ లెవల్ రూట్ మ్యాప్ తయారు చేయనున్నట్టు వివరించారు. ఈ సమావేశం అనంతరం పలు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, అక్కడ జరుగుతున్న అభివ్రుద్ధి పనులను కూడా స్వయంగా పరిశీలిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యకు ప్రాధనిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా సంవత్సరాల తరువాత ఉన్నతవిద్యాశాఖ పై జరుగుతున్న ఈ సమీక్షలో చాలా సమస్యలకు పరిష్కారం లభించనుందని తెలుస్తుంది.