9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలు..


Ens Balu
1
Tadepalle
2021-06-23 13:32:46

రాష్ట్ర వ్యాప్తం బోట్లను కంట్రోల్ చేయడానికి 9 కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
ప్రైవేటు బోటు యజమానులతో జూన్ 24న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 50 బోట్లకు గానూ 48 బోట్లు అనుమతులు తీసుకున్నాయని, అవి గురువారం నుంచే బోటింగ్ నిర్వహించుకోవొచ్చునన్నారు. ఇప్పటికీ కొందరు ప్రైవేటు బోటు యజమానులు లైసెన్సులు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా ప్రైవేటు బోట్లు నిర్వహించేలా కొత్త విధి విధానాలు రూపొందించామన్నారు. వాటిపై ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పర్యాటక, స్పోర్స్టు అధికారులు పాల్గొన్నారు.