ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల మైండ్ సెట్ మారితేనే విద్యార్ధుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి ఆస్కారం వుంటుందని ఉన్నతవిద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డా.పోలాభాస్కర్ అన్నారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత విశాఖలో తొలి సమావేశం ఉత్తరాంధ్రాలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిల్స్ తో ఏయూలోని డా.వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో విద్యార్ధులకు అత్యధిక సమయం ఆన్ లైన్ విద్య అందించడానికి సమయం వెచ్చించాలన్నారు. అదే సమయంలో పాత విద్యావిధానాలకు స్వస్తిచెప్పి నూతన విద్యావిధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్ధులకు మంచి విద్య అందించడానికి ఆస్కారం వుంటుందన్నారు. నేను ఇలాగే ఆడుతూ పాడుతూ పనిచేస్తాను..ఈవిధంగానే ఉంటానంటే కుదరదని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆన్ లైన్ చేసి సెంట్ర్ సిస్టమ్ ద్వారా మానటరింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కాలేజీల్లో అడ్మిషన్లు పెంచడంతోపాటు, ఆన్ లైన్ విద్యలో విద్యార్ధులు విధిగా పాల్గొనేలా చేయాలన్నారు. విద్యార్ధులు, అద్యాపకుల ఆన్ లైన్ విద్య కోసం ప్రత్యేకంగా యాప్ ప్రవేశపట్టినట్టు వివరించారు. దీని ద్వారా ఏఏ కాలేజీల్లో ఎంత అద్యాపకులు, ఎన్ని గంటలు ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు అందించారో కూడా మానిటర్ చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ప్రభుత్వ డిగ్రీకాలేజీలతోపాటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల ప్రన్సిపాల్స్ కూడా ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. వారికి ప్రభుత్వమే ఎయిడ్ ఇస్తున్నందున ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. త్వరలోనే అద్యాపకులకు నూతన విద్యావిధానంపై శిక్షణా తరగతులను ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యార్ధులు డిగ్రీ పూర్తిచేసుకొని బయటకు వెళ్లగానే వారికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు వచ్చే కోర్సులను కాలేజీల్లోకి అందుబాటులోకి తేవాలన్నారు. అంతే తప్పా ఏదో ఆడుతూ, పాడుతూ పనిచేసుకుంటూ పోతాం..మన జీతం మనకి వచ్చేస్తుందనే దోరణికి ఇకపై స్వస్తి చెప్పాలన్నారు. డిగ్రీవిద్యలో విద్యార్ధులు అన్నికోర్సుల్ల విద్యార్ధులు చేరేందుకు ముందుగా దగ్గర్లోని ఇంటర్ కాలేజీలను సందర్శించి అక్కడి నుంచి విద్యార్ధులను చేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా డ్రాపౌట్స్ లేకుండా చూసుకోవాలన్నారు. శతశాతం విద్యార్ధులు డిగ్రీపట్టాతో బయటకు వెళ్లే విధంగా విద్య అందించడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేయాలన్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జోన్లలోని ప్రిన్సిపాళ్లతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విద్యాభివ్రుద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషనర్ పోలా భాస్కర్ వివరించారు. ఈ సమీక్షలో ఆర్డీలు, ఆర్జేలు, తదితరులు పాల్గొన్నారు.