ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇక పక్కాగా ఈ-ఆఫీస్..
Ens Balu
2
Tadepalle
2021-06-26 05:41:20
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసి కాగితపు రహిత కాలేజీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కొన్ని కాలేజీల్లో ఈ-ఆఫీస్ అమలు జరిగినా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. తాజాగా ఉన్నత, సాంకేతిక విద్యా కమిషనర్ గా డా.పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ డిగ్రీకాలేజీలు ను అభివ్రుద్ధి చేయడంతోపాటు, విద్యార్ధులకు నాణ్యమైన విధ్యను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ పాత విధానాలతో నడిచే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలతో సమీక్ష నిర్వహించిన తరువాత ప్రభుత్వం డిగ్రీ కాలేజీల విషయంలో ఏ తరహా చర్యలు తీసుకుంటుందో కమిషనర్ స్పష్టంగా అర్ధమైంది. దానికోసం అన్ని కాలేజీల్లోనూ ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ఇక అన్ని వ్యవహారాలు ఈ-ఆఫీస్ లోనే నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేయడంతో చక చకా పనులు జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ కాలేజీల్లో అన్ని ఆర్ధిక పరమైన అంశాలను ఆఫ్ లైన్ లో జరుగుతున్నాయి. ఇకపై అన్ని కార్యకలాపాలు ఆన్ లైన్ లోనే కాలేజీ ప్రిన్సిపాల్స్ చేయాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో ఇక ప్రభుత్వ కాలేజీల పేరు చెబితే ప్రైవేటు విద్యాసంస్థలు సైతం కంగారు పడేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. రాష్ట్రప్రభుత్వం నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఉన్నత విద్యలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఏ పనైనా దేశం మొత్తం తొంగి చూసేలా చేయడంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలా భాస్కర్ ది అందివేసిన చేయి. ప్రభుత్వం కూడా ఈ అధికారిని ఉన్నతవిద్యకు కమిషనర్ ని చేయడంతో కాలేజీవిద్యలో సమూల మార్పులకు ఈయన శ్రీకారం చుట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆరు నెలల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల స్వరూపం, విద్యా విధానం అన్నీ ప్రైవేటే కాలేజీలను తలదన్నే విధంగా తయారుకావడం ఖాయంగా కనిపిస్తుంది. తొలుత ఈ-ఆఫీస్, ఆపై ఆన్ లైన్ విద్య, తరువాతర ఉపాది అవకాశాలు కలిగేలా విద్యాబోధన, కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్లు ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వ డిగ్రీకాలేజీలను మార్చాలనేది కమిషనర్ ఆలోచనగా కనిస్తుంది. ఈ విషయమై కమిషనర్ డా.పోలా భాస్కర్ ను ఈఎన్ఎస్ సంప్రదించినపుడు రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజీల అభివ్రుద్ధికి తీసుకునే చర్యల రోడ్ మ్యాప్ ను ప్రత్యేకంగా వివరించారు. పేపర్ లెస్ కాలేజీలుగా మారి కాలేజీల సమాచారం మొత్తం ఆన్ లైన్ అయితే ఒక్కో అభివ్రుద్ధి మొదలు పెడతామని వివరించారు. ఇప్పటికే ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించామని ఆయన వివరించారు.