సేవలపై అవగాహన కల్పిస్తే కాసుల వర్షం..
Ens Balu
3
Tadepalle
2021-06-26 07:15:02
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల 5 గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందిస్తున్న 545 సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం అమాంతంగా పెరిగి కాసులు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ నేటికీ సచివాలయాల్లో ఏ తరహా ప్రభుత్వ సేవలు అందుతున్నాయో ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు చూసినా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల సంఖ్యపై పత్రికల్లో పేజీలకు పేజీలు ప్రచారం చేస్తుంది తప్పితే.. సచివాలయాల్లో అందించే సేవలు పేర్లు, వాటి సంఖ్యను, నేటికొ ఒక్క సారి కూడా ప్రచారం చేయలేదు. జిల్లా కలెక్టర్, జెసీలు, జిల్లా శాఖల అధికారులు ఎప్పుడు సచివాలయాలను సందర్శించినా..సిబ్బంది వస్తున్నారా లేదా.. రిజస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా.. ఏ అర్జీలను పరిష్కన్నారు.. అనే విషయమై పరిశీలన చేస్తున్నారు తప్పితే. .ప్రభుత్వం సచివాలయాల్లో అందించే సేవలపై ఏ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు.. ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు.. ఏ శాఖల పరిధిలోని సేవలు ఏ శాఖకు చెందిన ఎవరెవరు ప్రజలకు తెలిసేలా చేస్తున్నారనే కోణంలో ఏ ఒక్క అధికారి ప్రశ్నించిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక మండల స్థాయి అధికారులైతే సచివాలయ సిబ్బందిని ఉద్యోగులుగా కాకుండా హైస్కూలు విద్యార్ధుల్లా చూస్తూ.. కరోనా వేక్సినేషన్ కార్యాక్రమాల్లో టార్గెట్లు ఇవ్వడం, అవి పూర్తిచేయకపోతే ఇబ్బందులు పడతారని, ఆదివారాల్లోనే ఈ ప్రత్యేక వేక్సినేషన్ కార్యక్రమాలు పెట్టడానికే వారు సమయం మొత్తం వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మండలాల్లో సచివాలయ ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కాలేదని, తాము చెప్పినట్టు వినకపోతే ఉద్యోగాలు తీసేస్తామనే కోణంలో బెదిరించడానికే సమయం అంతా సరిపోతుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నేటికీ కరెంటు బిల్లులు కట్టించుకునే సదుపాయం కూడా సచివాలయాల్లోకి అందుబాటులోకి రాలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో గ్రామాల్లో విద్యుత్ శాఖకు చెందిన బిల్ కలెక్టర్లు వచ్చి మాత్రమే బిల్లులు కట్టించుకుంటున్నారు. లేదంటే మీసేవా కేంద్రాల్లో కట్టించుకుంటున్నారు. అక్కడ అందే సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుతున్నా..ఆ దిశగా ప్రజల వరకూ చేర్చే పని మాత్రం ఎవరూ చేయడం లేదు. కనీసం గ్రామసభలు పెట్టినపుడు సైతం సచివాలయాల్లో అందించే సేవలపై అవగాహన కల్పించడం లేదు. అజెండాలోని అంశాలే పూర్తిగా చెప్పలేని పరిస్థితులు నెలంకొటున్నాయి. అదేవిధంగా ఆధార్, బ్యాంకు అకౌంట్లు, రెవిన్యూ సేవలు, వివిధ రకాల పన్నులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అనుమతులకు సంబంధించి చాలా సర్వీసులు గ్రామ సచివాలయం నుంచే అందుతున్నాయనే విషయం నేటికీ ప్రజలకు తెలియడం లేదు. ఎప్పటి మాదిరిగానే ప్రజలు నేటికీ మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఆఖరికి సచివాలయ పరిధిలోనే సర్వేయర్లు భూమలకు సంబంధించిన సర్వేలు కూడా చేస్తారనే విషయం తెలియదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతీ సచివాలయాల్లో 12 నుంచి 14 ప్రభుత్వ శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. ఎవరి పరిధిలోని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వారు ప్రజలకు అవగాహన కల్పించినా సచివాలయాల ద్వారా అందించే సేవల వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం వుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు జిల్లా అధికారులు సచివాలయాల ద్వారా అందే సేవల విషయంలో ప్రజలకు తెలిసేలా చేస్తే...ప్రభుత్వానికి ఆదాయం ఒక్కసారిగా భారీస్థాయిలో పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి..లేదంటే సచివాలయాల్లో 545 ప్రజాల సేవలు అందిస్తున్నారని చెప్పుకోవడానికి తప్పా దేనికీ పనిచేయకుండా మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..!