విద్యార్ధులకు onlineక్లాసులు చెప్పాల్సిందే..


Ens Balu
2
Tadepalle
2021-06-28 03:04:13

ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ విద్యలో పెను మార్పులు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ఆదేశాలతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 పాలిటెక్నిక్ కాలేజీలు, 140 ఎయిడెడ్ డిగ్రీకాలేజీల ప్రిన్సిపాళ్లు  దారిలోకి వచ్చారు. ప్రభుత్వం విద్యార్ధుల ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ప్రతీ అధ్యాపకుడు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాల్సిందే. ఇదేదో ఉత్తుత్తి మాటలతో ఊరకనే ఊరకనే ఇచ్చే ఆదేశాలు కావు..  ఖచ్చితంగా ఏ అధ్యాపకుడు యాప్ లోకి లాగిన్ అయి ఎంత సేవు విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు.. ఎంత మేరక సిలబస్ పూర్తి చేస్తున్నారు.. విద్యార్ధులు ఏ మేరకు స్పందిస్తున్నారు.. అనే అంశాలన్నీ రాజధానిలోకి కమిషనరేట్ లో ఒక్క మీట నొక్కి తెలుసుకునే విధంగా పక్కాగా రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ( మొబైల్ యాప్ విత్ డేష్ బోర్డ్) తో అద్యాపకులంతా ఆన్ లైన్ లోకి వచ్చి పాఠాలు చెబతున్నారు.. కరోనా సమయంలో విద్యార్ధులు కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు..అలాగని వారికి పాఠాలు చెప్పకపోతే వారి విద్యమధ్యలోనే ఆగిపోతుంది..మీకు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జీతాలిస్తోంది.. దానిని ద్రుష్టిలో పెట్టుకొనైనా ఖచ్చితంగా ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాల్సిందే..లేదంటే చర్యలు తప్పవు అంటూ ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇచ్చిన హెచ్చరికతో మూడు రోజుల్లో 50శాతానికంటే తక్కువగా వుండే ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అటెండెన్సు ఒక్కసారిగా 20శాతానికి పెరిగింది. విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలు చెప్పడానికి ప్రతీ లెక్చరర్ ఖచ్చితంగా ల్యాప్ ట్ ప్ వినియోగించాలని ఆదేశాలు జారీచేయడంతో చక చకా పాఠ్యాంశాలు బోధించడానికి అద్యాపకులు ఒక్కొక్కరుగా ఆన్ లైన్ లోకి వస్తున్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆన్ లైన్ ద్వారానైనా పాఠాలు చెప్పించి వారిని సబ్జెక్టు పరంగా అభివ్రుద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్షమని..దానికోసమే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు కమిషనర్ పోలాభాస్కర్ ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా వివరించారు. ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామన్నారు. అందులో ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాల్స్ తోపాటు, ఆర్జేడీలు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ లో డాష్ బోర్డులో ఎంత మంది విద్యార్ధులకు పాఠ్యాంశాలు చెప్పారో ఎప్పటి కప్పుడు తెలుసుకునే వీలుపడేలా ఎంతో ఉపయుక్తంగా ఈ యాప్ రూపొందించినట్టు ఆయన వివరించారు. అటు ఎయిడెడ్ డిగ్రీకాలేజీలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తున్నందున వారికి కూడా ఈ అదేశాలు, నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో ద్రుడ సంకల్పంతో వుందని ఎవరు ఆ నిబంధనలను అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోయేది లేదని కూడా కమిషనర్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత రాష్ట్రప్రభుత్వం కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించడంతో విద్యార్ధుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి కమిషనర్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చేదిశగా కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..!