కన్ఫర్డ్ వద్దు.. డైరెక్టు ఐఏఎస్ ముద్దు..


Ens Balu
11
Tadepalli
2021-06-28 05:12:58

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన పరిపాలన వ్యవస్థలో భారీ మార్పులకు తెరలేపింది.. యుపీఎస్సీ నుంచి నేరుగా సెలక్ట్ అయిన ఐఏఎస్ లతోపాటు ఇతర సివిల్స్ సర్వీస్ కేడర్ అధికారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో కన్ఫర్డ్ ఐఏఎస్ లను పక్కనపెట్టి వారికి ప్రాధాన్యతలేని ప్రభుత్వ శాఖలను కట్టబెడుతున్నట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లా కలెక్టర్ హోదా అయిపోయి ఏదో శాఖకు కమిషనర్ గా వెళ్లిన వారిని సైతం మళ్లీ జిల్లా కలెక్టర్లుగా వెనక్కి తీసుకొచ్చి కలెక్టర్ సీట్లోనే కూర్చోబెడుతోంది.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గతంలో కొందరు కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా జిల్లా కలెక్టర్లుగా ఉండేవారు.. వీరంతా డైరెక్టు ఐఏఎస్ లకంటే అద్భుతమైన పనితీరు కనబరుస్తూ, ప్రజలకు విశేషంగా సేవలందిస్తూ.. ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు కూడా తీసుకొచ్చారు.. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలోని పరిపాలనను మొత్తమంతా డైరెక్టు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు కట్టబెట్టి కన్ఫర్డ్ ఐఏఎస్ లను ఇతర శాఖల్లో నియమించడం ద్వారా నేరుగా వచ్చేవారిని మాత్రమే జిల్లాలకు కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా పంపాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది.. గతంలో ఐఏఎస్ అధికారి అంటే ఏశాఖకు పంపినా చక్కగా వెళ్లి అక్కడ పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించేవారు. కానీ ఇపుడు కొందరు ఐఏఎస్ లు తమదైన స్టైల్ లో మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రి కుటుంబాలకు సన్నిహితంగా వుండేవారిని ప్రశన్నం చేసుకుంటూ నచ్చిన జిల్లాలకు కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్లకు కమిషనర్లుగా వెళ్లిపోతుండటం, రెండు మూడేళ్లు పూర్తయిపోయినా కదలకుండా పైరవీలు చేస్తూ అక్కడే తిష్టవేసుకొని కూర్చోవడం కూడా ప్రస్తం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకోమే ఇటీవల భారీగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించి వారి స్థానంలో డైరెక్టు ఐఏఎస్ లను నియమించింది ప్రభుత్వం. గతంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజాయ్ కల్లాం పనిచేస్తున్న సమయంలో ఎంతో మంచి అనుభవం వున్న కన్ఫర్డ్ ఐఏఎస్ లను కూడా జిల్లా కలెక్టర్లుగా నియమించారు.. ఆ ప్లేస్ లోకి ప్రవీణ్ ప్రకాష్ వచ్చిన తరువాత  ఒక్కో కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్ల భాద్యతల నుంచి తప్పిస్తూ వస్తుండటం ఐఏఎస్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తుంది. అలా తప్పించడంతో ఇపుడు రాష్ట్రంలో ఇద్దరు కన్ఫర్డ్ ఐఏఎస్ లు మాత్రమే విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా మిగిలారు. వీరిని కూడా త్వరలో జరగబోయో ఐఏఎస్ ల బదిలీల్లో జిల్లా కలెక్టర్ల స్థానం నుంచి మార్చేస్తారనే ప్రచారం జరగుతుంది. వాస్తవానికి డైరెక్టుగా యుపీఎస్సీ నుంచి ఐఏఎస్ గా వచ్చినా, ఇన్ సర్వీసులు ఐఏఎస్ హోదా పొందినా.. రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వం ద్రుష్టలో ఒకే విధాంగా ఉండాలి. కానీ ఎందుకనో రాష్ట్రప్రభుత్వం ఆ విధానానికి కొత్త భాష్యం చెబుతూ.. కన్ఫర్డ్ ఐఏఎస్ లను పక్కపెట్టాలని చూడటం ఏ రకమైన సంకేతాలు ఇస్తుందో అర్ధం కాకుండా వుంది. డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ లకైనా.. కన్ఫర్డ్ ఐఏఎస్ ల కైనా జిల్లా కలెక్టర్లుగా చేయాలనేది ఒక కల... అదే ఐఏఎస్ సర్వీసులో కీలకమైన ఘట్టం కూడా.. మొన్నటి వరకూ ఏ ఐఏఎస్ అయిన తన సర్వీసులో ఒక్కసారైనా జిల్లా కలెక్టరుగా ఓ రెండు మూడేళ్లు పనిచేస్తాననే నమ్మకం ఉండేది. ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కన్ఫర్డ్ ఐఏఎస్ లకు జిల్లా కలెక్టర్లుగా పనిచేసే అవకాశం రాకపోవచ్చుననే బలమైన సంకేతాలు ఇవ్వడానికే రాష్ట్రప్రభుత్వం అలాంటి వారిని మిగిలిన ప్రభుత్వశాఖలకు కమిషనర్లుగా పంపుతుందని చెబుతున్నారు. ఎంతో అనుభవం వున్న కన్ఫర్డ్ ఐఏఎస్ లు డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ ల కంటే ఎంతో చక్కగా, సమయస్పూర్తితో పనిచేస్తారు.. దారికి కారణం వారంతా ముందుగా గ్రౌండ్ లెవల్ రియాలిటీపై పనిచేసి, వివిధ శాఖలపై పట్టు పెంచుకొని ఉంటారు.. ప్రభుత్వం ఇన్ సర్వీసులో ఇచ్చిన అవకాశం ద్వారా వారు ఐఏఎస్ హోదా పొందుతారు. వాస్తవానికి అలాంటి వారిని జిల్లా కలెక్టర్లుగా ప్రభుత్వం నియమిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోడానికి మార్గం సుగమం అవుతుంది. అదే డైరెక్టు ఐఏఎస్ లకు ప్రభుత్వం ఇచ్చిన శిక్షణతో, వారి పనిచేసే సమయంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే పనిచేస్తాయి.. అలాగని డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ బాగాపనిచేయరని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. వీరైనా.. వారైనా.. ఒకేలా పనిచేస్తారు.. ఒక సారి ఐఏఎస్ అయిన తరువాత ఎవరినైనా ఒకే చూడాలన్న నిబంధనను పక్కన పెడితే జరిగే అభివ్రుద్ధి పక్కదారి పడుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇలా రాష్ట్రప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్ లను వేరే రకంగా చూస్తే అలాంటి వారంతా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయినా.. ఇదే విషయం అందరూ ఒకేలా ఆలోచిస్తే ఏదో ఉద్యోగమంటే ఉద్యోగంలా చేశాం తప్పా..అభివ్రుద్ధికోణంలోనూ.. ప్రజలకు మరిన్ని సేవలు అందించే కోణంలోనూ చేయడానికి ముందుకు రాకపోతే అనుకున్న అభివ్రుద్ధి ఆగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రస్తుత ఈ పరిస్థితులు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాల్సిందే..!