జపాన్ టోక్యో నగరంలో జులై 23,2021 నుంచి ఆగష్టు 8 వరకూ జరిగే ఒలింపిక్స్‌లో భారతదేశానికి మంచి పథకాలు సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్ పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్ జగన్ విషెష్ చెప్పి ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్ అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేసి అభినందనలు తెలియజేశీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, మరియు క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.