ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు విజయవాడలో బుధవారం ఓ హోటల్ లో జరిగాయి. యూనియన్ ఏర్పాటై 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా యూనియన్ రాష్ట్ర నూతన కమిటీని అధ్యక్షులుగా చొప్పారపు సాంబశివనాయుడు నాయకుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఈయనను రెండవసారి ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి.ప్రసన్నకుమార్ రెడ్డి(కడప), సి. సంజీవరెడ్డి (అనంతపురం)ప్రధాన కార్యదర్శిగా జూపూడి గురుకాంతాచారి,(ప్రకాశం) పి.సాయికుమార్, కార్యదర్శులుగా(గుంటూరు) బి. షాలన్న,(కర్నూలు) కొయిలాడ పరశురామ్, (విశాఖపట్నం) ఏ. రాధ కృష్ణ,(కృష్ణా జిల్లా)
సహాయ కార్యదర్శిలుగా ఎండీ హుమైన్,(విజయవాడ),నేమాల.హేమసుందర రావు,( విశాఖపట్నం),రాఘవేంద్ర రావు (కర్నూలు ) కార్యనిర్వహక సభ్యులుగా వై. శ్రీనివాసరావు, (తూర్పుగోదావరి),సంతోష్,(శ్రీకాకుళం), కె.సుధాకర చారి,( చిత్తూరు ), సత్యనారాయణ మూర్తి, (రాజమండ్రీ), టి. నరసింహం,(పశ్చిమ గోదావరి),సలహా సభ్యులుగా కాకుమాను వెంకట వేణు,గరగ ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.