ఏపీ రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు..
Ens Balu
3
Tadepalle
2021-07-03 03:27:16
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవిన్యూశాఖలో భారీ ఖాళీలు ఏర్పడనున్నాయి. చాలా సంవత్సరాల నుంచి డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అత్యధిక సంఖ్యలో 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. తహశీల్దార్లకు పదోన్నతులు ఇస్తే వారిని ఆర్డీఓలుగా చేయాల్సి వుంటుంది. కానీ దానిపై ఇంకా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలేదు. అంటే ఇపుడు ఆ 152 డిటీలు ఖాళీ అయిపోయినట్టే. ఇదే సమయంలో రెవిన్యూ ఇనెస్పెక్టర్లుగా ఉన్నవారికి అందులో కొన్నింటిని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఆర్ఐ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి..ఆ స్థానంలోకి ఇప్పటికే సర్వే శిక్షణ పూర్తిచేసుకున్న 26 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఆర్ఐ లుగా పదోన్నతి ఇవ్వాల్సి వుంటుంది. అలాగైనా 26 జూనియర్ అసిస్టెంట్లు ఖాళీలు అవుతాయి. ఇలా చైన్ లింక్ ప్రమోషన్ సిస్టమ్ వారీగా చూసుకుంటే రెవిన్యూశాఖలో ఆర్డీఓ, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్లు ఇలా చాలా పోస్టులే రెవిన్యూశాఖలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ తీయడానికి నిర్ణయించుకున్న తరుణంలో వచ్చే జాబ్ కేలండర్ లో పెద్ద ఎత్తున రెవిన్యూ పోస్టులు జాబ్ కేలండర్ లో పెరగాల్సి వుంది. ఇవికాకుండా చైన్ మేన్ పోస్టులను చాలా కాలం నుంచి ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాటితోపాటు వచ్చే ఏడాది చాలా మంది వీఆర్వోలు, తహశీల్దార్లు, డిటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లతోపాటు అటెండర్లు, బిళ్ల బంట్రోతులు కూడా ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ విధంగా చూసుకున్నా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఒక్క రెవిన్యూశాఖలోనే సుమారు 1000 ఉద్యోగాలకు పైగా వివిధ విభాగాల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి.