ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా..
Ens Balu
5
Tadepalle
2021-07-04 05:03:29
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్వరం మారుతున్నట్టు కనిపిస్తుంది..ప్రతీనెలా ఒటకవ తేదీకి ప్రతీ ఇంటికీ పించనుతో పాటు సంక్షేమ పథకాలు నగదు రూపంలోనే టంచనుగా అందుతున్నాయి.. మాకు మాత్రం 8డిఏలు, ఒక పీఆర్సీ ఇవ్వడానికి నిధులు లేవు.. సీపిఎస్ రద్దు చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావాడం లేదు అనే స్వరాన్ని ఉద్యోగులు బలంగా వినిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువా ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పోలీసులకు వారాంతపు సెలవులు మంజూరు చేయడం తప్పా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మరే ఎన్నికల హామీలేవీ నెరవేరలేదు. ఇంకో రెండేళ్లు కాలం వెళ్లదీస్తే మరోసారి ఉద్యోగులకు కొత్తగా హామీలివ్వాలని ప్రభుత్వం చూస్తోందనే దోరణిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎందుకు వాటిని కావాలనే పక్కన పెట్టిందని ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్నాయి. ఈ విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసినా ఫలితం మాత్రం కనిపించలేదనే వాదన కూడా వినిపిస్తుంది.. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను రద్దు చేయాలని ఉద్యమం చేసిన నేటి అధికారి ప్రభుత్వం సీట్లోకి రాగానే... నేరుగా రెగ్యులర్ ఉద్యోగాలకు మంగళం పాడటానికి ఏకంగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని మండి పడుతున్నారు. ప్రజలకి ఇచ్చిన హామీలే హామీలా...ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు ఇచ్చినవి హామీలు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే ఉంటే మరో రెండేళ్లు కాలయాపన చేసి..వచ్చే ఎన్నికలకు కూడా ఇవే హామీలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందనే కోణంలో ఉద్యోగ సంఘాల్లోని సామాజిక మాద్యమాల్లో విపరీతంగా చర్చకు తెరలేపారు. పైకి వ్యక్తం చేస్తే ప్రభుత్వం నేరుగా ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేస్తుందని భావించిన ఉద్యోగ సంఘాలు చాపకింద నీరులా తమ తదుపరి కార్యాచరణకు అంకురార్పణ చేసినట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో ఇదే విషయమై సంప్రదింపులు చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి ప్రతిపాదనలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఎన్నికలు సమీపించే నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకమై ప్రభుత్వానికి తెలియకుండా దెబ్బకొట్టే సూచనలు కూడా లేకపోలేదు. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖల్లోని అధికారలు, ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు, సంఘాల నేతలపై ఏసీబీ దాడులు, బదిలీలు, ఇతర శాఖ పరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడంతో ఉద్యోగులంతా బయటపడకుండా రహస్య మంతనాలు చేస్తూ వ్యతిరేక కూటమికి బలం పెంచుతున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన సీపిఎస్ రద్దు హామీ, పీఆర్సీ, 8 డిఏల బకాయిలు, పదోన్నతులు, బదిలీలు విషయంలో చర్యలు ఉద్యోగులకు అనుకూలంగా తీసుకుంటుందా లేదంటే ప్రజలంతా మనవైపు వుంటే చాలన్నట్టు వ్యవహరిస్తుందానే అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది..!