తాజంగిలో గిరిజన మ్యూజియం..


Ens Balu
2
Komarada
2021-07-04 10:20:27

విశాఖజిల్లా, చింతపల్లి మండలం లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన చారిత్రాత్మక గ్రామంలోనే అల్లూరి సీతారామరాజు ను శాశ్వతంగా స్మరించుకొనేలా ‘‘ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం’’ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టబోతోందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఆదివారం కొమరాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి త్వరలోనే శంకుస్థాపన కూడా చేయనున్నారని వెల్లడించారు. నిలువనీడ లేని పేద కుటుంబాలన్నింటికీ సొంతిళ్లను అందించే జగనన్న కాలనీల నిర్మాణం దేశానికంతటికీ ఆదర్శప్రాయమని అభివర్ణించారు. కాగా పుష్ప శ్రీవాణి రాజ్యలక్ష్మీపురంలో నిర్మించనున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పిఓ కుర్మనాధ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు,గృహ నిర్మాణ శాఖ ఇఇ శ్రీనివాస్ రావు, డిఇఇ చెన్న రాయడు, మండలం ప్రత్యేక అధికారి శాంతిశ్వర్ రావు ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్ధన నాయుడు, వైస్సార్సీపీ సీపీ నాయకులు నంగిరెడ్డి శరత్ బాబు, సర్పంచ్ అంబటి వెంకటిలక్ష్మి,మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చింతల సంఘం నాయుడు, శివిని సింగిల్ విండో అధ్యక్షులు దాసరి శ్రీధర్, అంబటి తిరుపతి నాయుడు, నాలి గుంపస్వామి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.