ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం రోజూ లక్షల రూపాయల్లో ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ విషయం మీకు కాస్త తేడాగా కనిపించొచ్చు.. కాని ఇదినిజం.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరితే.. ప్రభుత్వ ఖజనా గల్ గల్ మనడం ఖాయమని మీరే అంటారు.. కావాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. తొలుత మీ-సేవా కేంద్రాల్లో అందించే 56 సేవలు సచివాలయాల ద్వారా పొందవచ్చునని ప్రకటించి ఆ సేవలు మొదలు పెట్టింది. అంతేకాకుండా ఆ.. సేవలను సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను సైతం అదేశించింది. కానీ ఆదేశాలు జిల్లా కేంద్రాలకే పరిమితం అయిపోవడంతో సచివాలయాల్లోని సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.. నేటికీ కుల, ఆధాయ, మరణ, జనన ద్రువీకరణ పత్రాల కోసం చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మీ-సేవాల కేంద్రాలకే వెళుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. వున్న సేవలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లలేని ప్రభుత్వం మళ్లీ ఇక్కడే మరో489 సర్వీలను గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు గ్రామంలోనే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్న సేవలకే ప్రజలకు అందే దిక్కులేకపోతే.. ఇక కొత్త సర్వీసులపై ప్రజలకు ఏం అవగాహన కలుగుతుందో అది ప్రభుత్వమే చెప్పాల్సి వుంది. ప్రభుత్వం ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలపై పేజీలకు పేజీలు పత్రికల్లో ప్రకటనలివ్వడం తప్పితే ప్రజలకు సచివాలయాల ద్వారా అందే సేవల విషయంలో నేటికీ కనీసం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక్క ప్రకటన జారీ చేయకపోవడం విశేషం. ఒక్కోసచివాలయంలో సుమారు 14 ప్రభుత్వశాఖల సిబ్బంది ద్వారా అందే సేవలతోపాటు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు డిజిటల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసినా.. ఉపయోగం లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వారం పదిరోజుల ముందు సంబంధిత ద్రువీకరణ పత్రాలు అందించడం తప్పితే.. ఏ సచివాలయ పరిధిలో ఏఏ శాఖలకు చెందిన సేవలు అందిస్తున్నారో.. కనీసం సచివాలయాల డిస్ప్లే బోర్డుల్లో సైతం ప్రజలకు తెలిసేలా సేవల వివరాలు తెలియజేసే ఏర్పాటు చేయలేదు. మేజర్ పంచాయతీల్లో 3 గ్రామ సచివాలయాలు, వార్డుల్లో నాలుగు నుంచి 5 వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం అత్యవసర సేవలు కూడా అందడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాలన్నీ ఒకే సారి ప్రభుత్వం ప్రకటించిన సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగితే ప్రభుత్వ గళ్ల పెట్టి మోగే సౌండ్ రాష్ట్ర మొత్తం వినిపించాలి. ఈ శాఖకు చెందిన కమిషనర్ నుంచి గ్రామాల్లోని సచివాలయ కార్యదర్శి వరకూ నేటికీ ఏ ఒక్కవిషయంలోనూ ప్రోటోకాల్ ప్రకారంగా సేవల వివరాలు అందాయా వేళ్లపై మాత్రమే లెక్కెట్టి చెప్పేంత స్థాయిలో పరిస్థితి ఉన్నదంటే అతిశయోక్తి కాదేమో. విశేషమేమిటంటే గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీలు చేసే జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సచివాలయంలో కూడా ఏఏ రకాల సేవలు అందుబాటులో వున్నాయి.. ఇప్పటి వరకూ ఎన్ని రకాల సేవలు ఏఏ సచివాలయాల ద్వారా అందించారనే వార్త రాకపోవడమే నిదర్శనం. ఆదాయం వచ్చే మార్గాలున్నా.. ఇక్కడే వుండి సేవలు అందించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్పితే.. ప్రజలకు సేవలు అందిస్తూనే..వారికి పనికొచ్చే వివిధ ద్రువీకరణ పత్రాల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందంచుకోవాలని నేటికీ ఒక్క అధికారి కూడా హిత బోద చేసిన దాఖలాలు లేవు. ఒక్కో సచివాలయం మీద ప్రభుత్వం ఇపుడిచ్చే ప్రొభిషనరీ సర్వీసు జీతం కింద లెక్కేసినా ఒక్కో గ్రామ సచివాలయానికి రూ.2.25 లక్షలు జీతాలకే ప్రభుత్వం వెచ్చిస్తోంది. కానీ ఒక్కో సచివాలయంపై రోజుకి రూ.2500 వరకూ కూడా ఆదాయం మాత్రం రావడంలేదు.. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిలు ఇక్కడ అందించే సేవల విషయంలో పూర్తిస్థాయిలో ద్రుష్టి సారిస్తే..ప్రజలకు గ్రామస్థాయిలోనే ప్రభుత్వ సేవలు అందడటంతో పాటు.. ప్రభుత్వానికి సమయానికి ఆదాయం కూడా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!